ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం వింటారు. అంతే కాకుండా తమ రాశి వారికి ఎలా ఉంది? వారి వారి ఆదాయ వ్యయాలు, రాజ పూజ్యం అవమానం గురించిన వివరాలను తెలుసుకుంటారు. అయితే స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆదాయ, వ్యయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వీరికి ఏలినాటి శని ప్రారంభ దశ కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఇక మీన రాశి పూర్వభాద్ర 4 పాదాలు, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ రాశి వారి అధిపతి గురువు, అదృష్ట రంగు పసుపు, క్రీమ్, తెలుపు, అదృష్ట సంఖ్యలు 3,7,9. ఈ రాశి వారి ఆదాయం 14, వ్యయం 11.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి గ్రహాల సంచారం వలన కాస్త అదృష్టం కలిసి వస్తుంది. పనుల్లో విజయాలు అందుకుంటారు. ఇంటిలో సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఏలి నాటి శని రెండవ దశ కొనసాగడం వలన శారీరక , అలసట, మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. అంతేకాకుండా ఇతరులతో వాగ్వివాదం జరిగే ఛాన్స్ ఉంది. మాట్లాడే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా మీ సహనమే మిమ్మల్ని కాపాడుతుంది.
అలాగే, జూన్ రెండు నుంచి గురు నాలుగవ ఇంటా అర్ధాష్టమ స్థానంలో ఉంటాడు ,కాబట్టి ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ రాశి వారికి జూన్ రెండు తర్వాత పదోన్నతలు, ఉద్యోగ మార్పు, బాధ్యతలు పెరగడం వంటివి జరుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే ఉద్యోగులకు సంవత్సరం ప్రారంభంలో పలు సమస్యలు ఎదురు అవుతాయి. కానీ సంవత్సరం చివరలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయాలను అందుకుంటారు.
ఇక ఈ రాశి వారికి ఆదాయం కూడా బాగుంటుంది. ఏలి నాటి శని ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యలు తగ్గిపోయి, సమయానికి ధనం చేతికి అందుతుంది. స్థిరాస్తి ద్వారా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి డిసెంబర్ తర్వాత అప్పుల మొత్తం తీరిపోయి, చేతి నిండా డబ్బుతో చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వలన ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.
విద్యార్థులకు బాగుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇక ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జన్మరాశిలో శని సంచారం వలన కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, అలసట వంటివి ఇబ్బందుల తలెత్తుతాయి. అదేవిధంగా, శని ప్రభావం వలన కుటుంబంలో కలహాలు జరిగే ఛాన్స్ ఉంది. కుటుంబంలో అశాంతి నెలకుంటుంది. కాబట్టి కాస్త చాలా జాగ్రత్తతో మెదలాలి.
Also read
- గరుడపురాణం ప్రకారం ఆత్మ నరకలోక ప్రయాణంలో 8వ పట్టణం విచిత్రభవనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా..?
- నేటి జాతకములు..2 మే, 2026
- చెడు కొలెస్ట్రాల్‌ను సహజంగా కరిగించే.. బెస్ట్ డ్రింక్స్ ఇవే!
- Andhra Pradesh: అయ్యో పాపం రాహుల్.. తల్లిదండ్రుల కళ్ల ముందే ప్రాణాలు విడిచి..
- ఎన్నడూ చూడని దృశ్యం.. 20 అడుగుల కొండచిలువ ఎలా చెట్టు ఎక్కుతుందో చూడండి..
- ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు
- ఆ చిన్నారి ఏం పాపం చేసిందిరా..! 18 నెలల పాపను గోడకేసి కొట్టి చంపిన కిరాతకుడు..!
- వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
- కూల్ డ్రింక్ అని తాగితే కొంప మునిగినట్టే..! జ్యూస్‌సెంటర్ల గుట్టురట్టు.. నిర్వాహకుల కక్కుర్తి చూస్తే, చీ వాక్!!
- కన్నది కాదు కసాయిది.. బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్లో నవజాత శిశువు.. ఆ దృశ్యం చూస్తే
- కండక్టర్ కన్నింగ్ ప్లాన్.. చెకింగ్ అధికారిపై దాడి ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు
- మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య..అసలేం జరిగిందంటే..












