జల ప్రవాహంలో కొట్టుకుపోయి తండ్రి, ఇద్దరు కుమారుల మృతి శంఖవరం, అన్నవరం : వ్యవసాయ భూమిలో ఉండిపోయిన మోటరు ఇంటికి తెచ్చుకునే క్రమంలో జల ప్రవాహంలో గల్లంతై తండ్రి, ఇద్దరు కుమారులు మృత్యువాత పడ్డారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా శంఖవరం గ్రామానికి చెందిన పిల్లా నారాయణరావు (55), ఆయన పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్ (30), రెండో కుమారుడు రాజేష్ (20)లు అన్నవరంలోని పంపా రిజర్వాయర్ క్యాట్మెంట్ ఏరియాలో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి నీరు భారీగా చేరడంతో పొలంలో ఉండిపోయిన విద్యుత్తు మోటర్ను తీసుకొచ్చేందుకు బుధవారం సాయంత్రం ముగ్గురూ బైక్పై వెళ్లారు.
ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గురువారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నారాయణరావు పెద్ద కుమారుడికి వివాహం కాగా, రెండో కుమారుడు డిగ్రీ పూర్తిచేశాడు. వీరంతా ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. నారాయణరావుకు ఇద్దరు కుమార్తెలూ ఉన్నారు. వీరిలో ఒకరికి వివాహమైంది.
Also read
- Eagle Force: యూనివార్సిటీ క్యాంపస్ లో డ్రగ్స్ నెట్ వర్క్ లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
- నా మృతికి వైద్యులు, పోలీసులే కారణం..ఉరి వేసుకొని యువకుడి బలవన్మరణం
- మోటర్ కోసం వెళ్లి.. మృత్యు ఒడిలోకి
- Hyderabad: విద్యార్థులు తినబోతుండగా కూరలో కనిపించిన వింత వస్తువు.. చివరికి ఏమైందంటే?
- కన్నకూతురు చనిపోయిందని వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లి.. అనుమానంతో ఆరా తీస్తే షాకింగ్ నిజం!





