ఉరి వేసుకొని యువకుడి బలవన్మరణం
పలువురిపై కేసు నమోదు
ఆదిలాబాద్: చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే.. వైద్యులు అనుచితంగా ప్రవర్తించారని, పోలీసులతో కొట్టించారని ఆరోపిస్తూ.. ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలోని వికలాంగుల కాలనీలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన రాహుల్ (25) పుణెలో ఉద్యోగం చేస్తుండగా.. దసరాకు ఇంటికి వచ్చారు. అయితే, బుధవారం రాత్రి తేలు కుట్టిందని చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్్స్కు వెళ్లారు. అక్కడ వైద్యులు సరైన విధంగా స్పందించకపోవటంతో వారి వైఖరిని ఫోన్లో చిత్రీకరించే క్రమంలో సీఎంఓగా ఉన్న వైద్యుడు సౌరబ్, స్టాఫ్ నర్సు మమత అనుచితంగా ప్రవర్తించారు. న్యూసెన్స్ చేస్తున్నాడంటూ డయల్-100కు వారు సమాచారం ఇవ్వగా.. టూటౌన్ హెడ్కానిస్టేబుల్ ఫతేసింగ్ అతడిని స్టేషన్కు తరలించారు. తర్వాత రాహుల్ను విడుదల చేశారు. ఇంటికి వెళ్లి అతను సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్నారు. యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి రిమ్స్ వైద్యులు, టూటౌన్ పోలీసులే కారణమంటూ దళిత సంఘాల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ ఘటన విచారణ చేపట్టటానికి అదనపు ఎస్పీ బి.సురేందర్రావును ప్రత్యేక అధికారిగా నియమించారు. మృతుని తండ్రి కె. రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యుడు సౌరభ్, స్టాఫ్ నర్సు మమతతో పాటు టూటౌన్ హెడ్కానిస్టేబుల్ ఫతేసింగ్, బ్లూకోర్టు కానిస్టేబుల్ జీవన్, హోంగార్డు నవీన్లపై ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ
ఎల్.జీవన్రెడ్డి తెలిపారు.
Also read
- Eagle Force: యూనివార్సిటీ క్యాంపస్ లో డ్రగ్స్ నెట్ వర్క్ లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
- నా మృతికి వైద్యులు, పోలీసులే కారణం..ఉరి వేసుకొని యువకుడి బలవన్మరణం
- మోటర్ కోసం వెళ్లి.. మృత్యు ఒడిలోకి
- Hyderabad: విద్యార్థులు తినబోతుండగా కూరలో కనిపించిన వింత వస్తువు.. చివరికి ఏమైందంటే?
- కన్నకూతురు చనిపోయిందని వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లి.. అనుమానంతో ఆరా తీస్తే షాకింగ్ నిజం!





