తెలుగు నూతన సంవత్సరం, ఉగాది పండుగ మార్చి 19న తెలుగు ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు నుంచి స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుంది. ఏలినాటి శని ప్రభావం చివరి దశ ఎలా ఉంటుంది? ఆదాయ వ్యయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. చాలా రోజుల తర్వాత ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నప్పటికీ వీరికి చాలా అద్భతంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే, గత కొన్ని రోజుల నుంచి ఏలినాటి శని వలన ఇబ్బంది పడుతున్న ఈ రాశివారికి చివరి దశ కొన్ని సానుకూల ఫలితాలను కూడా ఇస్తుంది. ధనిష్ట 3,4, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలలో జన్మించిన వారు కుంభ రాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి అధిపతి శని, అదృష్ట సంఖ్య 8,4,7. ఈ ఏడాదిలో కుంభ రాశి వారి ఆదాయం 2, వ్యయం 8. లాభం కంటే వ్యయం అధికంగా ఉండటం వలన ఈ రాశుల వారు ఖర్చుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి
కుంభ రాశి వారికి శ్రీ పరాభవ నామసంవత్సరం శని, ధన స్థానంలో మీన రాశిలో సంచరించడం ఏలినాటి శని చివరి దశను సూచిస్తుంది. ఇది ఖర్చులను పెంచుతుంది. అందువలన ఎందులో పెట్టుబడులు పెట్టినా, కాస్త ఆచీ తూచీ అడుగు వేయాలి. లేకపోతే అప్పుల సమస్యలు అధికం అవుతాయి. ఇక జూన్ 2 నుంచి గురువు 5వ ఇంట మిథునంలో ఉండటం వలన అద్భుతంగా ఉంటుంది. ఇక మీ జన్మ రాశిలో ఒకటవ ఇంట రాహు, కేతు సంచారం వలన కాస్త సానుకూల ఫలితాలు కలుగుతాయి.
ఈ రాశి వారికి అన్నివిధాల కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ జూన్ రెండు నుంచి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో అధికారులు, సీనియర్ల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు, అధికారులతో మాట్లేడే ముందు ఒకటికి, రెండు సార్లు ఆలోచించడం చాలా మంచిది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. భాగస్వామ్య వ్యాపారంలోకి వెళ్లకపోవడమే మంచిది. ఎవరినైనా నమ్మి వ్యాపరంలోకి దిగితే అది మీకే అనే సమస్యలను సృష్టిస్తుంది.
ఇక ఆర్థిక విషయాల్లో కూడా ఆచీ తూచి అడుగు వేయాలి. రెండవ ఇంట శని సంచారం వలన ఏదో ఒక సందర్భంలో డబ్బు ఖర్చు అయిపోతుంది. అంతే కాకుండా అప్పులు ఇస్తే తిరిగిరాకపోవడం, మాటపట్టింపులు రావడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం. ముఖ్యంగా డిసెంబర్ తర్వాత డబ్బు చాలా ఖర్చు అవుతుంది. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
రాజకీయనాయకులకు అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మాట్లాడే ముందు, వాగ్దానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇక విద్యార్థుకు బాగుంది. అనుకున్న కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. కుటుంబ జీవితంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి. మీ మౌనమే మిమ్మల్ని కాపాడుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు తారా స్థాయి చేరుతాయి కాబట్టి, వివాదాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇక ఈ సంవత్సరం కుంభ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది.
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం
- వామ్మో వీడు మాములోడు కాదు.. అటెండర్ ‘అప్-డేట్’ అయ్యాడు.. బ్యాంకును ‘అవుట్-డేట్’ చేశాడు!
- పెళ్లి రిసెప్షన్‌కి వచ్చి ఇంత పని చేశాడు ఏంటి..?
- TTD fake Darshan Ticket Gang: శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
- కరిగించి అమ్మితే కనిపెట్టలేరనుకున్నాడు.. కానీ నెల్లూరు పోలీసులు ‘ముద్ద’ తినిపించారు!
- ఆ పాత్ర ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తోందట.. కోటీశ్వరుడు కావడం ఖాయమట..!
- తోటి పోలీస్‌పైనే కేసు పెట్టిన పోలీస్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే.. ఎందుకో తెలుసా?
- పొద్దుపోయి ఇంటికొచ్చిన యజమాని.. అనుమానమొచ్చి షాప్ సీసీటీవీ కెమెరా చూడగా












