*
*బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ పిలుపు…*
అమరావతి:
రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన మేయర్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ రాష్ట్ర ప్రజలకు, బ్రాహ్మణ సమాజానికి పిలుపునిచ్చారు.
శుక్రవారం గుంటూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని కూడా లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు దిశానిర్దేశం చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అండగా నిలవాలని కోరారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, సైడ్ కాలువలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పార్కులు, స్థానిక సుందరీకరణ, డ్వాక్రా సంఘాల అభివృద్ధి, ఆలయాలు, ప్రాథమిక విద్యా వైద్య సేవలు, పేదలకు గృహ నిర్మాణం, కార్మిక సంక్షేమం, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అనేక రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు కూడా ఇస్తున్నారని శ్రీధర్ శర్మ పేర్కొన్నారు.
స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే సమర్థవంతమైన నాయకత్వం, అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన ప్రజాప్రతినిధులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామాలు, పట్టణాలు, నగరాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. తద్వారా రాష్ట్రంలో అరాచకాలను భూస్థాపితం చేద్దాం, సమగ్ర పాలన జరిగేలా మన వంతుగా సహకరిద్దాం.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూడా కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం అవసరమన్నారు. అందువల్ల ఎన్నికల రోజున ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, తమ అమూల్యమైన ఓటును కూటమి బలపరిచిన అభ్యర్థులకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని శిరిపురపు శ్రీధర్ శర్మ విజ్ఞప్తి చేశారు.
Also read
- కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుందాం..!*అరాచక పార్టీలను భూస్థాపితం చేద్దాం…!!
- UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
- Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియరై కత్తులతో దాడి, నగదు లూటీ..!
- ఎక్సెజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
- Gold Hunt: ఓ వైపు తుఫాన్.. మరోవైపు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..





