శ్రీ పరాభవ నామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుందా? ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరం మకర రాశివారికి చాలా అద్భుతంగా ఉంది. ఊహించని విధంగా ప్రయోజనాలు అందుకోనున్నారు. ఈ రాశి వారికి అధిపతి శని, అదృష్ట రంగు నీలం, నలుపు, అదృష్ట సంఖ్య 8,4,6. ఆదాయం 2, వ్యయం 8. ఈ సంవత్సరం మొత్తం వీరికి చాలా బావుండునన్నది
మకర రాశి వారికి ఏలి నాటి శని నుంచి ఉపశమనం కలగడం, అలాగే శని మూడవ ఇంట ఉండటం వలన శుభప్రదమైన ఫలితాలు కలగనున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసినా విజయం పక్కా, ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రతి పనిలో ముందుపడి చేయడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభంలో బాగుంది. అలాగే జూన్ రెండు నుంచి అక్టోబర్ వరకు అత్యంత యోగపరమైన సమయం అని చెప్పాలి.
ఎవరు అయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో, వారికి ఈ సమయంలో చాలా ఉత్తమమైనది. ఇట్లో శుభకార్యాలు జరుపుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఈ రాశి వారికి ధనానికి లోటు ఉండదు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ, కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి.
ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. శని సంచారం వలన ఆఫీసులో మీదే పై చేయి అవుతుంది. జీతం పెరుగుతుంది. ఉద్యోగ బదిలీ కోసం చూసే వారికి ఇదే మంచి సమయం అని చెప్పాలి. వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంది. వీరు కొత్త వ్యాపారం ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారానికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పాలి. పెట్టిన పెట్టుబడులు డబుల్ ఆదాయాన్ని తీసుకొస్తాయి.
రాజకీయనాయకులు తమ పరపతితోనే విజయం సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకొని చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనే వారి కోరి నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. టాప్ ర్యాంకులతో సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.
ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది, ఏడవ ఇంట గురు సంచారం వలన వివాహం కాని వారికి వివాహం నిశ్చయం అయ్యే ఛాన్స్ ఉంది. బంధు మిత్రులనుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విధాలా శ్రీ పరాభవ నామ సంవత్సరం వీరికి మేలు చేస్తుందని చెప్పాలి.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!
- చదువుల పండుగలో చేదు ఘటన.. స్కూల్ గేటు వద్ద కుప్పకూలిన విద్యార్థి!
- చచ్చే వయసులో ఇదేం పోయేకాలం .. షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు.. చివరకు
- ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. తెల్లారి స్విమ్మింగ్ పూల్‌లో తేలిన టెకీ డెడ్ బాడీ..! మిస్టరీగా మరణం
- పోలీసుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది?
- పంచాంగంలో ఉన్న 5 అంగాల రహస్యం తెలుసా? వీటి ప్రభావం జీవితంపై ఎలా ఉంటుందంటే!










