చెట్ల నరికి నేతను అడ్డుకున్న స్థానికులు
వెనుతిరిగిన సచివాలయ సిబ్బంది
కనిగిరి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిగిరిలో ఆదివారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర రోడ్ షో జరుగుతున్న నేపథ్యంలో సచివాలయ సిబ్బంది రోడ్లకు ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లను తొలగించారు. కనిగిరి శంకవరం, ఆర్టీసీ డిపో, జీవు సెంటర్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న నీడనిచ్చే చెట్లను తొలగిస్తుండటంతో స్థానికులు అధికారులతో వాగ్వాదం చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు చెట్లు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రోడ్లకు ఇరువైపులా నీడని పచ్చని వేప, చింత చెట్లను తొలగించడం ఏంటని సిబ్బందిని నిలదీశారు. కొన్నిచోట్ల సచివాలయ సిబ్బంది స్థానికులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ వస్తే ఏంటి గొప్ప అని.. పచ్చని చెట్లను ఎందుకు నరికేస్తున్నారని ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సచివాల సిబ్బంది 5 షట్లను నరికి వేశారు మరో 20 చెట్ల కొమ్మలను తొలగించారు .ఎక్కువ మంది చేరి నిలదీయడంతో సిబ్బంది వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆ చెట్ల కింద ఉంది కూలీ పనులు చేసుకునే వారు నీడ లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతోపాటుగా జీపు సెంటర్లో ఉండే డ్రైవర్లు ఆచెట్ల కింద సేత దిగడానికి సౌకర్యంగా ఉండేది. రోడ్లకు ఇరువైపులా ఉండే గత 50 ఏళ్లుగా నీడనిచ్చే చెట్లను నరికి వేయడంతో కనిగిరి ప్రజలు వైకాపా నాయకులపై, సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





