కడప : ఇంట్లో వాళ్లకు ఘోరం జరిగితే పట్టించుకోనివాళ్లు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు? అని వైఎస్ సునీత ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా సునీత ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. రాజకీయంగా అడ్డొస్తున్నారని వైఎస్ వివేకాను హత్య చేశారని ఆరోపించారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏదైనా చేయొచ్చని కానీ.. నేను పద్ధతి ప్రకారమే వెళ్తున్నాను అని తెలిపారు. ఇది నా వ్యక్తిగత సమస్య కానేకాదన్నారు. అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.. వివేకా అంశంపై మాట్లాడారని తెలిపారు. ‘‘ఎర్ర గంగిరెడ్డి ఏదో చేస్తుంటే అమాయకంగా అవినాష్ రెడ్డి చూస్తున్నారట. సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే ఆయన అంత అమాయకంగా ఎందుకు చూడాలి? ఆయన ఏమైనా పాలు తాగే పిల్లాడా? బాధ్యత లేదా..? ఇంట్లో వాళ్లకు ఘోరం జరిగితే పట్టించుకోనివాళ్లు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు? మీకోసం పనిచేసే షర్మిలను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’అని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో ఎన్ తులసి రెడ్డి, ఉమ్మడి అభ్యర్థి గాలి చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





