సత్తెనపల్లి : టిడిపి అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారని మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. సత్తెనపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత జగన్ మరోసారి సీఎం అవ్వడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారన్నారు. చంద్రబాబును తిట్టిన వాళ్లంతా ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారన్నారు. నేను పండక్కి డ్యాన్స్ చేస్తే విమర్శిస్తున్నారు.. కానీ చంద్రబాబు, ఆయన పక్కన ఉండే పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్యాన్స్ర్లని సెటైర్ వేశారు. పవన్ డబ్బుల కోసం డ్యాన్స్ వేస్తే.. చంద్రబాబు అధికారం కోసం అన్ని పార్టీలతో డ్యాన్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను చంద్రబాబును రాజకీయంగా మాత్రమే విమర్శించానని స్పష్టం చేశారు. చంద్రబాబు సభకు జనమే రాలేదని అన్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వస్తావా.? అని అడిగారు.. తీరా వెళ్లాక అసలు సినిమా చూపించింది.!
- మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!
- బస్టాండ్‌లో ఒంటరిగా తచ్చాడుతున్న మహిళ.. మ్యాట్రిక్స్ కెమెరాలతో చెక్ చేయగా.. పెద్ద ముదురే..
- ఒంటరిగా పడుకున్న మహిళను టార్గెట్ చేశాడు.. కట్ చేస్తే అరగుండు.. మెడలో చెప్పుల దండ..





