శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో ఘటనలు
మందస/శ్రీకాళహస్తి రూరల్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళంలో తల్లీ కూతురు మరణించగా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురం పంచాయతీ పెద్దకేశుపురం గ్రామంలో ఆదివారం పిడుగు పడి తల్లీకూతుళ్లు మృతి చెందారు.
మడియా కృష్ణవేణి(35), ఆమె కుమార్తె మడియా లోకేశ్వరి(15) ఆవులకు నీళ్లు పెట్టేందుకు పశువుల శాలకు వెళ్లగా అదే సమయంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడే ప్రాణాలు వదిలారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో పిడుగుపాటుకు కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. ఆదివారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.
అదే సమయంలో కలవగుంట గ్రామంలో కల్లుగీత కార్మికుడు వి.కామరాజు (35) తాటిచెట్టు ఎక్కి కల్లు దించుతున్నాడు. ఒక్కసారిగా తాటిచెట్టుపై పిడుగు పడడంతో కామరాజు చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రవీకరించారు. మృతుని సొంత ఊరు ఏర్పేడు మండలం, పరమాలపల్లి గ్రామం. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- Mysterious Temple: ఈ ఆలయంలో దెయ్యాలకు శిక్ష పడుతుందట..! ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కృష్ణాజిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య




