కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల మధ్య వచ్చిన గొడవ, ఒక నిష్కల్మషమైన పసిప్రాణాన్ని బలితీసుకుంది. ఆడుకుంటూ కనిపించిన నిత్విక అనే చిన్నారిని బాత్రూంలోని నీళ్ల డ్రమ్ములో ముంచి దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… గురువారం (జూన్ 25, 2026) సాయంత్రం 4:30 గంటల సమయంలో చిన్నారి నిత్విక ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఆ సమయంలో నిత్విక ఇంటి పక్కనే ఉండే స్వాతి అనే మహిళ, ఎవరూ లేని సమయం చూసి పాపను వెంటబెట్టుకుని వెళ్లింది. పక్క వీధిలోని ఒక ఇంటి బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి, అక్కడ ఉన్న నీళ్ల డ్రమ్ములో పాపను ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసింది.
స్నేహం కాస్తా పగగా మారి..!
చిన్నారి తల్లి సృజన, నిందితురాలు స్వాతి గతంలో ప్రాణ స్నేహితులు. అయితే పిల్లల విషయంలో వీరిద్దరి మధ్య చిన్న గొడవ మొదలై, అది కాస్తా తీవ్ర వైరంగా మారింది. ఈ వివాదం పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఆ కక్షను మనసులో పెట్టుకున్న స్వాతి, సృజనపై ఉన్న కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
దొరికిపోయిన నిందితురాలు
స్వాతి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాను పరిశీలించగా, ఆమె చిన్నారి నిత్వికను తన వెనుక పిలుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి పెద్దల పట్టింపులు, ఒక తల్లికి జన్మంతా తీరని శోకాన్ని మిగిల్చాయి.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




