SGSTV NEWS
Andhra PradeshCrime

సప్లిమెంటరీ అయినా పాస్ అయ్యేలా చదువుకోరా అని తల్లి గద్దించింది.. అంతే




సైదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతిలో ఫెయిల్ అయిన రిషి, సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని తల్లి సూచించినా, వీడియో గేమ్స్ ఆడుతూ, టీవీ చూస్తూ నిర్లక్ష్యం ప్రదర్శించాడు. తల్లి మందలింపు తన భవిష్యత్తు కోసం వచ్చిన ప్రేమతోనని అర్థం చేసుకోలేకపోయిన రిషి,

వీడియో గేమ్ ఆడుతూ, టీవీ చూస్తూ సరిగా చదవడం లేదని కొడుకును తల్లి మందలిం చింది. ఆ మందలింపు వెనుక ఉన్నది తన భవిష్యత్తుపై ఆమెకున్న బెంగ మాత్రమే అని అర్థం చేసుకోలేకపోయిన ఆ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వినాయక్ నగర్‌లోని రాధారెసిడెన్సీలో కంబాలపల్లి వెంకటయ్య, సుజాత దంపతులు కుటుంబం నివాసం ఉంటున్నారు. వెంకటయ్య అక్కడే వాచ్‌మెన్‌‌గా పనిచేస్తుండగా.. సుజాత కూడా నాలుగు ఇళ్లలో పనిచేస్తూ భర్తకు ఆసరాగా ఉంటుంది. వీరి పెద్ద కుమారుడు కంబాలపల్లి రిషి(16) ఇటీవల పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. దీంతో మానసిక ఒత్తిడికి గురికావడంతో కుటుంబసభ్యులు ధైర్యం చెప్పారు. త్వరలో జరగబోయే సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ట్యూషన్ పెట్టించారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఫోన్లో మొబైల్ గేమ్ ఆడుతుండగా, ఆదివారం టీవీ చూస్తుండగా తల్లి మందలించింది. కనీసం సప్లిమెంటరీ పరీక్షల్లో అయినా పాస్ అయ్యేలా చదవాలని గద్దించింది. దీంతో మనస్తాపానికి గురైన రిషి సోమవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ పైకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this