లక్నో, మే 14: ఓ డాక్టర్ నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆపరేషన్ తర్వాత పేషెంట్ కడుపులో దూదిని వదిలేశాడా డాక్టర్. డిశ్చార్జ్అయి ఇంటికి వెళ్లిన రోగి ఆరోగ్యం మరింత దిగజారింది. దీంతో పరుగుపరుగున మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్చేశారు. దీంతో పేషెంట్ కడుపులో దూది ఉన్న విషయం బయటపడింది. ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగింది. ఇదీ జరిగింది..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు లోహియానగర్‌క చెందిన సల్మాన్ అనే వ్యక్తి పిత్తాశయంలో అనారోగ్యం కారణంగా అదే ప్రాంతంలోని హాపుర్ రోడ్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చేరాడు. అక్కడ గత నెలలోనే ఓ వైద్యుడు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. అయితే వైద్యుడు ఆపరేషన్ చేస్తున్న సమయంలో కడుపులోనే దూదిని వదిలేశాడు. సర్జరీ తర్వాత పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోగా.. నానాటికీ మరింత క్షీణించసాగింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు అతడిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా.. అతడి కడుపులో దూది ఉండటం చూసి షాకయ్యారు. దీంతో అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి కాటన్ స్ట్రిప్‌ను తొలగించారు. అయితే తప్పు చేసినా.. ఆస్పత్రి వర్గాలు బుకాయించడం విడ్డూరంగా మారింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడని, సదరు ఆస్పత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు బిలాల్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు లోహియా నగర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి సంజయ్ సింగ్ తెలిపారు. విచారణ తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also read
- దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం.. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం!
- నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఏ నియమాలు పాటిస్తే శుభఫలితాలు లభిస్తాయి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- దెయ్యమై నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్ సూసైడ్ నోట్లో సంచలన విషయాలు!
- రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..





