SGSTV NEWS
Andhra PradeshCrime

కోనసీమలో పెను విషాదం.. పంక్షన్‌కు వెళ్లి గోదావరి దగ్గరకు వెళ్లారు.. అంతలోనే..

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముమ్మడివరం దగ్గర గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. మూడు మృతదేహాలు లభ్యం.. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి నుంచి SDRF, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న ముమ్మిడివరం దగ్గర ఫంక్షన్‌కి వచ్చిన స్నేహితులు.. భోజనాల తర్వాత గోదారిగట్టుకు వెళ్లారు. నీళ్లలోకి దిగి ఆడుతుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టుతప్పి ఒక యువకుడు మునిగిపోతుండడంతో.. అతన్ని కాపాడే ప్రయత్నంలో మరో ఏడుగురు గల్లంతయ్యారు.

వివరాల ప్రకారం.. కాకినాడ, మండపేట, రామచంద్రపురం నుంచి 11 మంది స్నేహితులు.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని శేరిలంకలో శుభకార్యానికి వచ్చారు. హాఫ్ శారీ పంక్షన్ అయిపోయిన అనంతరం సాయంత్రం వేళ అందరూ సరదాగా గోదావరి దగ్గరకు వెళ్లారు.. అనంతరం స్నానాలకు దిగి ఈత కొడుతుండటం ఒక యువకుడు మునిగిపోయాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో 8మంది గల్లంతయ్యారు. అయితే.. ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కరుణకుమార్‌, మేడిశెట్టి చరణ్‌ రోహిత్‌, కనికెళ్ల సురేష్‌ సురక్షితంగా బయటపడ్డారు. సాన్నానికి వెళ్లిన 11 మందిలో ఎనిమిది మంది గల్లంతవ్వడం కలకలం రేపింది.. ఈ విషయం తెలుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన సబిత క్రాంతి ఇమాన్యేలు (19), సబిత పాల్‌ (18), తాటిపూడి నితీష్‌ (18), ఎలుమర్తి సాయి (18), మండపేటకు చెందిన రోహిత్‌ (18), శేరిలంక ప్రాంతానికి చెందిన ఎలిపే మహేష్‌ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన అన్నదమ్ములు వడ్డే మహేష్‌ (16), వడ్డే రాజేష్‌ (14) గల్లంతయ్యారు.

వీళ్లకి ఈ ప్రాంతంలో నది ఎంత లోతు ఉంటుంది అనేది అంచనా తెలియలేదు. ముందు ఒక యువకుడు పట్టుతప్పి కొట్టుకుపోతుండడంతో అతని కాపాడే క్రమంలో మిగతా వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ మహేష్‌ కుమార్‌, ఎస్పీ కృష్ణారావు స్వయంగా రెస్క్యూ ఆపరేషన్‌ని పర్యవేక్షించారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

Also read

Related posts

Share this