పెడన: కృష్ణా జిల్లా పెడన మండలం దక్షిణ తెలుగుపాలెంలోని ఓ ఇంట్లో జూదం ఆడుతూ నలుగురు మహిళలు పట్టుబడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరో ఇద్దరు వ్యక్తులతో కలిపి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దక్షిణ తెలుగుపాలెంలో ఓ ఇంట్లో జూదం ఆడుతున్నారని మచిలీపట్నంలోని స్పెషల్ బ్రాంచికి సమాచారం అందగా.. వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.47,750 స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఈ నలుగురు మహిళలు స్థానిక పైడమ్మ కాలనీలో జూదమాడుతూ పట్టుబడ్డారని.. అందులో ఇద్దరిపై గతంలో 9 కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి మచిలీపట్నం కోర్టులో హాజరుపర్చగా.. సొంత పూచీకత్తుపై విడుదల చేస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
Also read
- లక్ష్మీ నారాయణ యోగం.. వీరికి పట్టింది బంగారమే
- ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యడు.. ఈ మూడు రాశుల దశ తిరగడం ఖాయం!
- Pushkaralu: పన్నెండేళ్ల పుష్కరాల రహస్యం.. ద్వాదశ రాశులు, 12 నదుల మధ్య ఉన్న సంబంధం ఇదే!
- నేటి జాతకములు..4 జూన్, 2026
- భవన నిర్మాణ కార్మికుల కు 10 లక్షలు ప్రమాద మరణ పరిహారం అందించాలి…..మల్లిడి రామిరెడ్డి, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం.





