పరకాల: ప్రియుడితో కలిసి భర్తను చంపించిన కేసులో భార్యతోపాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో హనుమకొండ జిల్లా పరకాలలో లావణ్య అనే మహిళ తన భర్త సుమన్ (35)ను హత్య చేయించిన సంఘటన రెండ్రోజుల క్రితం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సోదరుడు రాజు, ప్రియుడు నరేశ్తో కలిసి భర్తను చంపించినట్లు పోలీసులు నిర్ధరించారు. హత్య అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు గుర్తించారు. భర్తను చంపేందుకు రూ.5 లక్షలకు సుఫారీకి ఒప్పించినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
పరకాల పట్టణానికి చెందిన మడికొండ సుమన్ (35) స్థానిక ఓ రెస్టారెంట్లో పని చేస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. భార్య లావణ్య కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన ఒకరితో వివాహేతర సంబంధం పెట్టుకోగా దీనిపై పలుమార్లు ఇంట్లో గొడవలు జరిగాయి. కొద్ది రోజుల కిందట లావణ్య భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లిలోని తన పుట్టింటికి వెళ్లారు. ఈ నెల 3న సుమన్ కనిపించకుండా పోయారు. ఆయన తండ్రి సాంబయ్య నాలుగైదు రోజులపాటు ఎక్కడ వెతికినా కొడుకు ఆచూకీ లభించకపోవడంతో 8న పరకాల పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు. చివరకు భార్య లావణ్యపై పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ నెల 4న కొందరితో కలిసి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దయ్యాలవాగు సమీపంలో సుమన్ పై పెట్రోల్ పోసి చంపినట్లు తేలింది.
Also read
- మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?
- Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్..!
- లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..
- ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..





