కస్తూరి జింకలు గురించి మీకు తెలుసా..? అవి అంతరించిపోయే దశలో ఉన్న జీవులు. వాటిని వేటాడటం, బంధించడం, అక్రమ రవాణా చేయడం చాలా పెద్ద నేరం. అలాంటి కస్తూరి జింక అవశేషాలు ఓ వ్యక్తి ఇంట్లో కనిపించడంతో కలకలం చెలరేగింది. అధికారులు పూర్తి నిర్ధారణ కోసం వాటిని ల్యాబ్‌కు పంపారు.
స్మగర్ల చర్యలతో భారతదేశంలో జీవవైవిధ్యానికి ముప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే. ప్రధానంగా కస్తూరి జింకల వంటి అరుదైన జాతులు అంతరించేపోయే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినాయకపురంలో కస్తూరి జింకల అవశేషాల ఆనవాళ్లు కనిపించడంతో కలకలం చెలరేగింది.
అశ్వారావుపేట మండలం వినాయకపురంలో నివసిస్తున్న ఎస్.కె అబ్దుల్ హఫీస్ ఇంట్లో అరుదైన జంతువుల అవశేషాలున్నాయని అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) మురళి నేతృత్వంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక బ్యాగులో చిన్న బంతుల్లా కనిపించే 13 అవశేషాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కస్తూరి జింకకు సంబంధించిన అవశేషాలేనా అన్న విషయంపై అధికారులు నిర్ధారణకు రావాల్సి ఉందని తెలిపారు. మార్కెట్లో వీటికి ఉన్న భారీ డిమాండ్ వల్ల వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అవశేషాలకు సంబంధించి మరింత స్పష్టత కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)కి పంపారు.
కస్తూరి జింకల ప్రత్యేకత ఏంటి..?
వీటి శరీరంలో ఉత్పత్తి అయ్యే కస్తూరి అనే సువాసన పదార్థం కారణంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. కస్తూరి పురుష జింకల నాభి భాగంలో “కస్తూరి పౌచ్” ఉంటుంది. ఈ పౌచ్ ద్వారా వెలువడే సుగంధద్రవ్యం (మస్క్) సౌందర్య సాధనాలు, ఔషధ ఉత్పత్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీటిపై అక్రమ వేట జరుగుతోంది. దీనివల్ల ఈ జాతి అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం వీటిని వేటాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇవి సుమారు 50-60 సెం.మీ పొడవు, 10-15 కిలోల బరువు ఉంటాయి.
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..