వార ఫలాలు (జూన్ 14-20, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ వారం మంచి ఆఫర్లు అందే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ వారం ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు బలం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఏలిన్నాటి శని కారణంగా ఖర్చులు పెరగడం ఖాయమనిపిస్తోంది. ఈ వారంలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. శుభ యోగాలు, శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొత్త లక్ష్యాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొద్ది ప్రయత్నంతో ఆస్తి విషయాలు, ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా చక్కబడతాయి. అయితే, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. ఆదాయ వృద్ధి మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వృత్తి జీవితంలో ఒక్క క్షణం కూడా తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థుల్లో శ్రద్ధ పెరిగే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయానికి లోటుండదు. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అత్యధిక భాగం సానుకూలపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనల వల్ల సంస్థ బాగా లబ్ధి పొందుతుంది. ఇంటా బయటా మాట చెలామణీ అవుతుంది. వ్యాపారాలు కూడా లాభాలపరంగా ఊపందుకుంటాయి. సొంత ఆలోచనలు ఆశించిన ఫలితాలనిస్తాయి. సరైన నిర్ణయాలతో కుటుంబ వ్యవహారాల్ని చక్కదిద్దుతారు. కుటుంబపరంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు తగ్గుతారు. అష్టమ శని, వ్యయ గురువు వల్ల ఆర్థిక విషయాలు బాగా ఇబ్బంది కలిగిస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రతి పనీ ఆశించిన విధంగా పూర్తవుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. వారమంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయం లభిస్తుంది. అనుకోకుండా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో కార్య కలాపాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో కొత్తగా కొన్ని మార్పులు చేపడతారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చాలావరకు సానుకూలపడతాయి. మాటకు, చేతకు విలువ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ వ్యవహారాలు దారికి వస్తాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు అందుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది కానీ, వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో సఖ్యత, సాన్ని హిత్యం బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు మిమ్మల్ని అతిగా ఉపయోగించుకుంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన విషయాల్లో తల్లితండ్రుల సలహాలను తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వినడం, కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం సానుకూలపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా సకాలంలో పూర్తవుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదం దాదాపు పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు నిదానంగా తగ్గిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి వృద్ది చెందుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుని సరదాగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, ప్రమోషన్లకు సంబంధించి శుభవార్త అందుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. గురు, శనుల బలం బాగా తక్కువగా ఉన్నందువల్ల వారమంతా శ్రమ, తిప్పట కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరంగా పురోగతి చెందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాలి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో సానుకూలపడుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అంది వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.
Also read
- Weekly Horoscope: హమ్మయ్య.. వారి ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్! 12 రాశులకు వారఫలాలు
- Telangana: ఫోన్‌కు వచ్చిన ఒక్క మెసేజ్ ప్రాణం తీసింది.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- ‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!
- నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..
- ATM: ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్..!










