వార ఫలాలు (ఆగస్టు 02 – 08, 2026): మేష రాశి వారికి ఈ వారం ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృషభ రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని ప్రయత్నాలు, వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి, క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగా వకాశాలు అందివస్తాయి. ఆదాయానికి లోటుండదు. కుటుంబ జీవితంలో సామరస్యం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ధన, లాభ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగుతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు కొన్ని శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారికి ఈ వారమంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. విద్యార్థులు తేలికగా ఘన విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగ పరంగా ఆశించిన సమాచారం అందుతుంది. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రవి, గురు, శుక్రుల అనుకూల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ బాగా పెరుగుతుంది. సామాజికంగా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు కలుగు తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి. విద్యార్థులు కష్ట పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇంటా బయటా బాధ్యతలు, పనులు బాగా పెరిగి ఒత్తిడికి గురవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం, ప్రతిఫలం ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుజ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను వెతుకుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా స్తబ్ధత ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆలస్యం అవు తాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం చేయవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గురు, శుక్ర, బుధ గ్రహాల బలం కారణంగా వారమంతా ఆనందంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులకు వీలైనంతగా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు కలిసివస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
గురు, బుధ, రవుల బలం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. షష్ట స్థానంలో శనీశ్వ రుడి సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలువింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
గురు, శుక్రుల బలం కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన రాణింపు ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు మంచి స్పందన ఉంటుంది. వృత్తి, వ్యాపారాలను ఎక్కువగా సొంత ఆలోచనలతో నిర్వహించుకోవడం మంచిది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కుజ, రాహు, శుక్రుల బలం అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. నాయకులకు అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతల్ని సకాలంలో, సంతృప్తికరంగా పూర్తి చేయడంలో అందరికన్నా ముందుంటారు. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలి స్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శుక్రుడు, బుధుడు, గురు, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా సమయ స్ఫూర్తితో వ్యవహరించి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిడి, చికాకులు ఉండే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కుజ, రవి, బుధ గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనుకోకుండా పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కార మవుతుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా ఇంటా బయటా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఏ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేసే సూచనలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.
Also read
- August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు..
- Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు
- అంబటి నీకు చేత అయితే హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకో, ఎఐ తో కాదు…
- పరారీలో వైసీపీ నేత చింతాడ రవికుమార్
- August 2026 Horoscope: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..
- Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి!
- ఏడాదిగా వెంటాడుతున్నాడు
- నేను చెప్పింది చెయ్! లేదంటే నీ ఫొటోలు అందరికీ..
- Hyderabad: అంత ఈజీగా ఎలా నమ్ముతారో.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!










