సాధారణంగా నదులు, చెరువుల్లో పడితే.. వాటిల్లో మొసళ్లు ఉంటే అవి మనుషుల మీద దాడి చేసి గాయపర్చడం, చంపడం చేస్తుంటాయి. కానీ ఓ దగ్గర మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధమైన సంఘటన జరిగింది. జీవితం మీద విక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామని నదిలో దూకిన యువతిని అనూహ్యంగా మొసలి కాపాడింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది మాత్రం నిజం.
ఈ సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఉడుపికి చెందిన సదరు యువతి ఆత్మహత్య చేసుకునేందుకు నదిలోకి దూకగా, ఆమెపై నీటిలో ఉన్న ఒక మొసలి దాడి చేసింది. ప్రాణభయంతో ఆమె పెట్టిన కేకలు విని స్థానికులు నది నుంచి ఆమెను క్షేమంగా ఒడ్డుకు చేర్చడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అసలేం జరిగిందంటే..
సదరు యువతి బుధవారం రాత్రి దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుక్కె సుబ్రమణ్యకు చేరుకుంది. కుటుంబ పరిస్థితులు, ఇతర సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఈక్రమంలో అక్కడే ప్రవహిస్తున్న కుమారధార నదిలోకి దూకి చనిపోవాలని యత్నించింది. అయితే నీటిలో మునిగిన వెంటనే ఒక మొసలి ఆమెపై దాడి చేసి కొరికేందుకు ప్రయత్నించింది. గాయపడిన యువతి వెంటనే ప్రాణభయంతో గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది.
స్థానికులు స్పందించడంతో
యువతి ఆర్తనాదాలు విన్న సమీపంలోని గెస్ట్ హౌస్ సిబ్బంది, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని నదిలో ఉన్న ఆమెను ఒడ్డుకు సురక్షితంగా తీసుకొచ్చారు. మొసలి దాడి వల్ల స్వల్ప గాయాలైనప్పటికీ, ఈ ఊహించని సంఘటనతో ఆమెకు ఆత్మహత్య గండం తప్పి ప్రాణాలు దక్కాయి. దేవుడే మొసలి రూపంలో వచ్చి ఆమె ప్రాణాలు కాపాడాడని స్థానికులు అభిప్రాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో కుటుంబ వివాదాల వల్లే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి, అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
Also read
- ఆకాశ దీపం అంటే ఏంటి ? కార్తీకంలోనే దీన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
- కార్తీకమాసం ప్రారంభం
- Diwali Poker Night: ‘దీపావళి పోకర్ నైట్’ గుట్టురట్టు: 20మంది మహిళలు అరెస్ట్!
- యువతిని బతికించిన మొసలి..
- నకిలీ డెత్ సర్టిఫికెట్తో ప్రభుత్వ ఉద్యోగం.. రూ.16 లక్షలకు బేరం.. చివరికి ఏమైందంటే?





