*ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ) తో తప్పుడు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం – టిడిపి సీనియర్ నేత శిరిపురపు శ్రీధర్ శర్మ*
అమరావతి:
మాజీ మంత్రి అంబటి రాంబాబు తనకున్న సోషల్ మీడియా వింగ్ ద్వారా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ ను వ్యక్తిత్వ హననం కి పాల్పడుతూ ఏ ఐ వీడియో రూపొందించి సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం చేయడం జరిగిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అంబటి రాంబాబుకి హుందాగా రాజకీయాలు చేయటం చేతకాదని, రాజకీయాల్లో దిగజారిపోయి రాజకీయం చేయటం ప్రజలు ప్రజలు గమనిస్తున్నారని ఇప్పటికైనా అంబటి హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని, ఏఐతో రాజకీయాలు చేయటం చివరికి ఏఐగా మిగిలిపోతావని టిడిపి సీనియర్ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ శర్మ గుంటూరులో విలేకరుల సమావేశంలో అంబటికి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రం నుంచి వందల కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి గుంటూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారు. ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కేంద్ర పథకాల అమలులో ఆయన చూపుతున్న చొరవకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు విధానాలు అంబటి రాంబాబు అవలంబిస్తున్నాడని,
ఇలాంటి అభివృద్ధిని చేతయితే రాజకీయంగా ఎదుర్కోవాలని, అలా ఎదుర్కోలేక, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏఐ సాంకేతికతతో రూపొందించినట్లు ఆరోపణలు ఉన్న వీడియోను సోషల్ మీడియాలో తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరం. రాజకీయాల్లో విమర్శలు చేయాలంటే వాస్తవాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలు,ధర్నాలు,ఉద్యమాలు చేయాలి గానీ, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏఐ సాంకేతికతను ఉపయోగించడం ఏమాత్రం సమర్థనీయం కాదు.
ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేలా ఉండాలి కానీ అంబటి రాంబాబు లాంటి కొందరు వైసీపీ నాయకులు చౌకబారు రాజకీయాలు, అసత్య ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలతో, కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోంది. ఇటువంటి స్వార్ధ రాజకీయాలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
ఈ వ్యవహారంపై సంబంధిత పోలీసు దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా, వేగంగా విచారణ జరిపి, చట్టాన్ని ఉల్లంఘించిన అంబటి రాంబాబు తదితర వైసీపీ సోషల్ మీడియా వింగ్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు.
ప్రజలు అంబటి రాంబాబు, వైసిపి నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను, ఏఐ ఆధారిత తప్పుడు సమాచారాన్ని విశ్వసించకుండా వాస్తవాలను గుర్తించాలని, అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని శ్రీధర్ పిలుపునిచ్చారు.
*శిరిపురపు శ్రీధర్ శర్మ*
బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ కో – ఆర్డినేటర్
Also read
- అంబటి నీకు చేత అయితే హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకో, ఎఐ తో కాదు…
- పరారీలో వైసీపీ నేత చింతాడ రవికుమార్
- August 2026 Horoscope: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..
- Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి!
- ఏడాదిగా వెంటాడుతున్నాడు





