SGSTV NEWS online
Andhra PradeshCrime

పరారీలో వైసీపీ నేత చింతాడ రవికుమార్

మహిళా ఎస్సైపై దౌర్జన్యం ఘటనలో కేసు వీడియో విడుదల చేసిన చింతాడ ఎస్సైకి ఆరోగ్యం బాగోలేదని జనంలో నుంచి పక్కకు తీసుకెళ్తే కేసు పెట్టారని వ్యాఖ్య



శ్రీకాకుళం: వైసీపీ అధ్యక్షుడు జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా… నడిరోడ్డు మీద మహిళా ఎస్సైపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనకు బాధ్యుడైన ఆమదాలవలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ శుక్రవారం పరారయ్యారు. ఫోన్ స్విచాఫ్ చేసి కనిపించకుండా పోయారు. తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఎస్సై తన నియోజకవర్గంలోనే పనిచేస్తున్నారని, ఈమధ్య ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. అందువల్లే తాను ఆమె వద్దకు వెళ్లి, ‘మీకు ఆరోగ్యం బాగోలేదు కదా, జనం వచ్చి పడుతున్నారు.. ఇక్కడనుంచి వెళ్లండని పక్కకు తీసుకెళ్తున్నాం. ఈలోపు అక్కడకు చేరిన జనం నినాదాలు చేశారు. దాంతో ఆమె చెవులు మూసుకున్నారు.. జరిగిందిదే. కానీ, మాపై హత్యాయత్నం, లేడీ ఎసాల్టింగ్, చట్టవిరుద్ధంగా కుట్ర, అధికారి విధులను అడ్డుకోవడం వంటి పలు సెక్షన్ లతో కేసు పెట్టారు’ అని చెప్పారు.

సాయంత్రం ప్రకటన… ఉదయమే పరారీ: మహిళా ఎస్సైపై దాడి ఘటనలో చింతాడ రవికుమార్, మరికొందరిపై పోలీసులు పలు సెక్షన్ ల కింద కేసు నమోదుచేశారు. ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం వరకు బయటపెట్టలేదు. కానీ, శుక్రవారం ఉదయమే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

పోలీసుల్ లో వైసీపీ  కోవర్టులు: మహిళా ఎస్సైపై

అసభ్యంగా ప్రవర్తించిన చింతాడ రవి, అతని అనుచరులపై 24 గంటలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రశ్నించారు. వెబ్సైట్ లో ఎక్కడా చింతాడుపై కేసు పెట్టినట్లు కనిపించలేదని.. కానీ, శుక్రవారం ఉదయమే ఈ సెక్షన్లంటూ ఎలా చెప్పారని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే కోవర్టులు ఉన్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు.

నేరచరిత్ర ఉన్నవారే మహిళా ఎస్సైపై దాడి చేశారు:

ఎస్సై ప్రవల్లికపై దౌర్జన్యం చేసిన చింతాడ రవికుమార్ అనుచరుల్లో పలువురికి గతంలో నేరచరిత్ర ఉంది. ఈ ఘటనలో రవికుమార్ సహా 21 మందిపై కేసు నమోదుచేశారు. ఏ2 బొడ్డేపల్లి శ్రీను గతంలో పలాసకు చెందిన వ్యాపారి లక్ష్మీనారాయణను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో ఆయనపై గతేడాది నవంబరు 6న పలాస పోలీసులు కేసు నమోదుచేశారు. ఏ4 అన్నెపు కృష్ణ గతంలో ఎమ్మెల్యే కూన రవికుమార్పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయగా.. కేసు నమోదైంది. మరోవ్యక్తి 2024లో ఆస్తుల ధ్వంసం కేసులో నిందితుడు. ఇంకొంకరిపై కొట్లాట కేసు ఉంది.



మహిళా ఎస్సై ప్రవల్లికను పరామర్శించిన గౌతు శిరీష

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత జగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ శ్రేణుల దౌర్జన్యకాండ బాధితురాలు, బూర్జ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై ప్రవల్లికను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం పరామర్శించారు. స్టేషన్ కు వెళ్లి జరిగిన ఘటన గురించి తెలుసుకున్నారు. వైసీపీ నేత చింతాడ రవికుమార్, ఆయన అనుచరులు దౌర్జన్యం చేసిన తీరును శిరీష ఖండించారు. ఎస్సైకి ధైర్యం చెప్పి జరిగిన ఘటనకు బాధ్యులపై కఠినచర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని కోరామన్నారు.

Also read

Related posts