SGSTV NEWS online
Andhra Pradesh

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టి‌యు రాష్ట్ర కమిటీ సభ్యులు.


       ఐ‌.యఫ్‌.టి‌.యు ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మంటపం వద్ద నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్స్, వాచ్ మెన్ లు మరియు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమావేశం. ఐ.యఫ్‌.టి‌.యు అనుబంధం గా ఏకగ్రీవంగా ఎన్నికైన నిడదవోలు ఏరియా కమిటీ.
గౌరవాధ్యక్షులు: పామర్తి సత్యనారాయణ
ప్రెసిడెంట్: కంటిపూడి ఆదిలక్ష్మి
వైస్ ప్రెసిడెంట్:
1) బొంతా రామకృష్ణ
2) ఉప్పులూరి పార్వతి
ప్రధాన కార్యదర్శి: రవ్వ సురేష్ కుమార్
జాయింట్ సెక్రటరీ: గంగవరపు సుమలత
గిద్దా సోమరాజు
కోశాధికారి: మచ్చా సరోజిని
కార్యవర్గ సభ్యులు: షేక్ బషీరా, ఆవునూరి నాగమణి, పనసకాయల సావిత్రి, చెల్లే వరలక్ష్మి
   ఈ సందర్భంగా ఇఫ్టు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్, నిడదవోలు ఏరియా ఇఫ్టూ అధ్యక్షులు పామర్తి సత్యనారాయణ లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో వంట తయారీ బిల్లులు విడుదల కాకపోవడం తో పెట్టుబడి పెట్టిన కార్మికులు అప్పులు పాలవుతున్నారనీ, పధకం నిర్వహణకు కార్మికుల కు వేతనం పేరిట చెల్లించే వేతనం జీఓ ప్రకారం రు.8 వేలు ఇవ్వాల్సి వుండగా కేవలం రూ. 3 వేలు ఏ ప్రాతిపదికన నిర్ణయించారో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
      ఐ.యఫ్.టి.యు నిడదవోలు పట్టణ అధ్యక్షులు రవ్వ సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి మల్లిడి రామిరెడ్డి లు మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్స్ మరియు వాచ్మెన్ లకు జిఓ నెంబరు 7 ప్రకారం రు. 15 వేలు కనీస వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షురాలు కంటిపూడి ఆదిలక్ష్మి, ఉప్పలూరి పార్వతి లు మాట్లాడుతూ ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారనీ, తల్లికి వందనం పధకం లో మినహాయింపు చేసుకున్న సొమ్ము ను తమ కోసం ఖర్చు పెడతామని ప్రకటించి కూడా తమకు బకాయిలు పెట్టడం ఆక్షేపణీయమన్నారు.
       పై కార్యక్రమంలో ఎలిపే నాగమణి, యాతం కోటేశ్వరి, కృపావతి, ఈశ్వరమ్మ, అంబటి విజయలక్ష్మి , యస్. రమణ, కుమారి,  తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts