SGSTV NEWS
CrimeTelangana

HYD Crime: తాగిన మైకంలో ఇలా చేశావేంట్రా.. తన భార్య అనుకుని పక్కింటి మహిళ పై..!



హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పరిధి కాటేదాన్‌లో దారుణం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సలీమ్‌ తాగిన మైకంలో తన భార్యను చంపాలనుకొని పక్కంటి మహిళపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఫుల్‌గా తాగి చేసిన ఓ పని ఇప్పుడు సంచలనంగా మారింది.  తాగిన మైకంలో ఆ వ్యక్తి చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. తన ఇల్లు అనుకుని పక్కింట్లోకి వెళ్లి మహిళపై కత్తితో దాడి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

భార్య అనుకుని పక్కింటి మహిలపై

మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సలీమ్‌ దంపతులు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని కాటేదాన్‌లో నివాసముంటున్నారు. అక్కడే ఉండి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి సలీమ్, అతని భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగానే శుక్రవారం అర్థరాత్రి ఫుల్‌గా తాగిన మైకంలో సలీమ్ తన ఇల్లు అనుకుని పక్కింట్లోకి వెళ్లాడు. అనంతరం తన భార్య అనుకుని పక్కింట్లో ఉన్న అబేదా (25) మహిళపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె గట్టిగా అరుపులు అరవడంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు.. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘ! &#టనపై మైలార్‌దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సలీమ్ పరారీలో ఉండగా.. అతడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

Also read

Related posts

Share this