SGSTV NEWS online
Andhra PradeshCrime

కలెక్టరేట్‌లో తీవ్ర విషాదం.. ఉన్నతాధికారి వేధింపులకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి బలి!






రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని గిరిజన సంక్షేమ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పై అధికారి మానసిక వేధింపులు తట్టుకోలేక వాడ్త్య శ్రీధర్ బాబు (39) అనే అవుట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


శ్రీధర్ బాబు 2012 నుంచి కలెక్టరేట్‌లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. జూన్ 1వ తేదీన తన కూతురి కాలేజీ అడ్మిషన్ నిమిత్తం పై అధికారి అనుమతి తీసుకుని ఆయన త్వరగా ఇంటికి వచ్చారు. అయితే, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే అదే శాఖకు చెందిన లోన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు నుంచి శ్రీధర్ బాబుకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన, పడకగదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే శ్రీధర్ మృతి చెందారు.

లోన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు పదేపదే ఫోన్లలో వేధిస్తూ, తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం వల్లే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య సరోజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు నిందితుడు శ్రీనివాస్ నాయుడుపై BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ముగ్గురు పిల్లలు, భార్య, తల్లిని వదిలి ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడటం కలెక్టరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Also read

Related posts