SGSTV NEWS online
Andhra PradeshCrime

Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..




పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేసేందుకు ప్రయత్నించాడు……… అడ్డు వచ్చిన సిబ్బందిపై దారుణంగా దాడి చేశాడు. వాళ్లు రక్తంతో విలవిలలాడుతున్నా.. బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించాడు.. సీన్ కట్ చేస్తే.. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ కంత్రీ క్రిమినల్ ఎవరు? ఆ బ్యాంక్కు అతడికి సంబంధం ఏంటి? పని చేస్తున్న బ్యాంకులోనే దోపిడీ చేయడానికి అసలు కారణం ఏంటి?

ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ.. లాంటి అలవాట్లు ఓ బ్యాంక్ మేనేజర్ను.. చివరికి దొంగగా మార్చేశాయి. నిన్నటిదాకా బ్యాంక్ మేనేజర్గా డిగ్నిటీగా ఉన్న ఆతడు కాస్తా.. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇక్కడ చూడండి.. ఇతనే ఆ వ్యక్తి. విశాఖ సీతమ్మధారకు చెందిన రవి కుమార్ బ్యాంక్ ఆఫ్ బరోడా మర్రిపాలెం బ్రాంచ్ మేనేజర్గా విధులు నిర్వహించేవాడు. ఇతడికి కొంత కాలం నుంచి ఆన్లైన్ రమ్మీ, క్రికెట్ బెట్టింగ్ బాగా అలవాటయ్యాయి. వాటిల్లో పెట్టుబడి కోసం ఆయినచోట కానిచోట అప్పులు చేశాడు. అలా పెట్టుబడులు పెట్టి డబ్బంతా పోగొట్టుకున్నాడు. కొన్ని నెలల క్రితం విశాఖ మర్రిపాలెం బ్రాంచ్ నుంచి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి బ్రాంచ్ కు బదిలీ చేశారు.

ఇది ఇలా ఉండగా ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీకి బాగా అలవాటు పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. వాటికోసం చేసిన అప్పులు, వడ్డీలు పెరిగాయి. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి మీదకు వచ్చారు. రోజురోజుకీ అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఎలా అయినా అప్పు తీర్చాలని ప్లాన్ వేశాడు.

ఇందులో భాగంగా గతంలో విధులు నిర్వహించిన మర్రిపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్కు వెళ్లాడు. పరిచయస్తుడు, తోటి ఉద్యోగి కావడంతో అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ శివరామరాజు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్లతో మాటలు కలిపాడు. సుమారు రెండు గంటలపాటు ఆఫీస్ విషయాలు లైఫ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. రాత్రి 7 గంటల సమయంలో బ్యాంక్ మేనేజరు అసిస్టెంట్ మేనేజర్ గోల్డ్ నిల్వలు టాలీ చేసి క్లోజ్ చేసి లాకర్లో భద్రపరచడానికి వెళ్లారు. అతని వెనకాలే వెళ్లిన రవికుమార్.. ఆ బంగారాన్ని పట్టుకొని పోవడానికి ప్రయత్నించాడు. దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేసిన మేనేజర్, అసిస్టెంట్పై ప్లాన్ ప్రకారమే ముందుగా తెచ్చుకున్న సుత్తితో దాడి చేశాడు. వారి తలపైన కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బిగ్గరగా అరుస్తూ బయటికి వచ్చారు బ్యాంకు మేనేజర్ శివరామరాజు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్. తీవ్ర గాయాలైనటువంటి వారిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అంబులెన్స్లో ఆసుపత్రులకు తరలించారు. అక్కడ నుంచి నిందితుడు రవికుమార్ పరారయ్యాడు.

మరోవైపు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తాను అప్పుల పాలైపోయానని.. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ వల్ల చాలా నష్టపోయానని.. అప్పులను తీర్చడానికే ఈ దొంగతనానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. నిందితుడు రవికుమార్పై హత్యాయత్నం, దోపిడీ యత్నం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ దాడిలో గాయపడ్డ మేనేజర్ శివరామరాజు అసిస్టెంట్ మేనేజర్ రమేష్క మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Also read



Related posts