SGSTV NEWS online
Andhra PradeshCrime

మైలవరం బస్టాండ్‌లో భారీ చోరీ.. ఐదుగురు మహిళల గుట్టు రట్టు!


ఎన్టీఆర్ జిల్లా: రద్దీగా ఉండే బస్టాండ్‌ను ఆసరాగా చేసుకుని.. ఐదుగురు మహిళలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని మైలవరం ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. దాంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.


పోలీసుల వివరాల ప్రకారం.. ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడే మైలవరం ఆర్టీసీ బస్టాండ్‌లో అదే సందర్భాన్ని అదునుగా చేసుకున్న ఓ ఐదుగురు మహిళలు ఏకంగా రూ.2.50 లక్షలు కొట్టేశారు. దీంతో బాధితుడు శీలం రాజశేఖర్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు.

విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు… సాంకేతిక ఆధారాల సాయంతో చోరీకి పాల్పడిన ఐదుగురు మహిళలను గుర్తించారు. మైలవరం మార్కెట్‌ యార్డు వద్ద వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts