SGSTV NEWS online
Crime

మాజీ ప్రియుడిపై కోపం.. షీ టీమ్స్ పేరుతో నకిలీ నోటీసు



హైదరాబాద్: ప్రేమ వ్యవహారం బ్రేకప్ కావడంతో
యువకుడిని భయపెట్టేందుకు.. షీ టీమ్స్ పేరుతో నకిలీ పోలీసు నోటీసు సృష్టించి వాట్సప్లో పంపిన యువతి, ఆమె స్నేహితుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీకి చెందిన ఓ యువకుడికి హరి అనే వ్యక్తి.. షీ టీమ్స్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ వాట్సప్ ద్వారా నోటీసు పంపాడు. దీంతో బాధితుడు ఆ నోటీసుతో షీ టీమ్స్ ముందు విచారణకు వెళ్లాడు. అయితే.. నోటీసు నకిలీదని తేలడంతో షీ టీమ్స్ ఎస్ఐ వెంకటేశ్.. సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థిని (24).. ఆ యువకుడితో ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన యువకుడు ఏడాదిగా దూరంగా ఉంటూ.. సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని తెలిసింది. దీంతో కక్ష పెంచుకున్న ఆమె ఏఐ సాయంతో షీ టీమ్స్ పేరుతో.. నకిలీ నోటీసు తయారు చేసి హరి ద్వారా పంపినట్లు వెల్లడైంది. సైఫాబాద్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts