SGSTV NEWS
CrimeTelangana

భద్రాద్రికొత్తగూడెంలో గ్యాంగ్ వార్.. ఇంట్లో కుటుంబసభ్యుల ముందే నరికి చంపిన దుండగులు


TS Crime: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాంగ్ వార్ విషాదాంతంకు దారి తీసింది. గత కొంతకాలంగా రెండు గ్యాంగులు పరస్పరం ఘర్షణ పడుతున్న ఘటనలు జరుగుతుండగా.. తాజాగా ఆ వార్ మరొకరిపై జరిగిన హత్యతో ముగిసింది. ఏఎస్సార్ కాలనీకి చెందిన కణితి సతీష్ అలియాస్ రాష్ భాయ్, జగదీశ్ కాలనీకి చెందిన అజయ్ మధ్య గతంలోనూ ఎన్నో సార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇవే చివరకు రాష్ భాయ్ ప్రాణాల మీదకు తెచ్చాయి. నిన్న రాత్రి అంబేద్కర్ సెంటర్ వద్ద సతీష్, అజయ్ గ్యాంగ్‌లు పరస్పర దాడులకు దిగారు. అయితే ఇది కేవలం ఆ రాత్రితో ముగిసిన విషయంగా కాకుండా.. ఉదయానికే హింసాత్మక మలుపు తిరిగింది.

ప్రాణం తీసిన గ్యాంగ్ వార్..

ఈరోజు ఉదయం సతీష్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. అజయ్ గ్యాంగ్ సభ్యులు అతని ఇంట్లోకి చొరబడి అతి దారుణంగా దాడి చేశారు. కత్తులు, రాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేయటంతో సతీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అతని కుటుంబ సభ్యుల కళ్లముందే జరగడం మరింత కలచివేసింది. అక్కడే రక్తపుమడుగులో పడిపోయిన సతీష్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనలో సతీష్ సోదరుడు అడ్డుగా వచ్చేందుకు యత్నించగా అతనిపైనా దాడి చేసి గాయపర్చారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రికిలో చికిత్స తీసుకుంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీలు, స్థానికుల వాంగ్మూలాలతో నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలోనూ ఘర్షణలకు తెరలేపిన ఈ రెండు గ్యాంగుల మధ్య తాజా ఘర్షణ ప్రాణహానికి దారితీయడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ ఘటనపై సరైనా విచారణ చేసి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు

Also read

Related posts

Share this