నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్య తల్లిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి కిరాతంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమాజంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి, చెడు అటవాట్లకు బానిసై కొందరు రక్త సంబంధాలనే తెంచుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్య తల్లిపైనే అత్యాచారానికి పాల్పడి.. ఆమెను అతి కిరాతంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో నివాసం ఉంటున్న ఓ మహిళకు ఇద్దరు సంతానం. అయితే కొన్నాళ్ల క్రితం తన పెద్దకుమార్తెకు తిమ్మాజీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించింది. అయితే పెళ్లైన కొన్ని రోజులు బాగానే ఉన్నా.. తర్వాత అల్లుడు తాగుడుకు బానిసై భార్యను వేధించడం స్టార్ట్ చేశాడు. బిడ్డను ఇచ్చిన పాపానికి చేసేదేమి లేక తన కుమార్తెతో పాటు అల్లుడిని కూడా తన దగ్గరకే తెచ్చి పెట్టుకుంది అత్త.
అయినా అల్లుడి తీరులో ఎలాంటి మార్పురాలేదు. మళ్లీ భార్యను వేధించడం నిత్యం ఆమెతో గొడవలు పడడం చేసేవాడు. ఇటీవల కూడా భార్యతో గొడవపడడంతో ఆమె తమ సమీప బంధువల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లో కేవలం అత్త మాత్రమే ఉంది. ఇదే అదునుగా భావించిన అల్లుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు.
గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి రెండో కుమార్తె ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు
Also read
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..





