హైదరాబాద్ నగరంలో పూజ పేరుతో మోసం చేసి బంగారు ఉంగరం మాయం చేసిన ఘటనలో.. పోలీసులు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పచ్చ రాయి చెక్కు ఉన్న 5 గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారు మధ్యప్రదేశ్‌కు చెందిన సుభాష్‌నాథ్ (23), కరణ్‌నాథ్ (21), సోహన్‌నాథ్ (23)గా గుర్తించారు. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి పహాడీ షరీఫ్‌లో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
వారసిగూడ పోలీసుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 5న లలితానగర్ జామియా ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా నివసిస్తున్న 62 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి వెంకిగల్ల రవిని ఇద్దరు వ్యక్తులు కలిశారు. వారు సాధువుల వేషంలో వచ్చి.. ఇంట్లో పూజ చేస్తామని నమ్మించారు. పూజ చేసే క్రమంలో రవిని బంగారు ఉంగరం ఇవ్వమని కోరారు. రవి ఇచ్చిన వెంటనే.. వారిలో ఒకరు ఉంగరాన్ని నోట్లో వేసుకుని మింగేశాడు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ అనూహ్య ఘటనతో బాధితులు రవి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో వారసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు BNSలోని పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
Also read
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..





