తెలంగాణ కోహీర్: కోహీర్ పట్టణంలో శుక్రవారం ఉదయం
దారుణం చోటుచేసుకుంది. చిల్లర డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో వ్యసనాలకు బానిసైన భర్త భార్య తలపై కర్రతో మోదీ దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కోహీర్ పట్టణంలో తీవ్ర కలకలం చెలరేగింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నివాసి సురేష్ అలియాస్ జైపాల్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీ నివాసి భాగ్యమ్మ (32)తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. భాగ్యమ్మ కుటుంబ పోషణ నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ లో పని చేస్తుంది. భర్త జైపాల్ జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసై వ్యక్తి గత ఖర్చులకోసం డబ్బులు ఇవ్వాలని తరచూ భార్యతో గొడవ పడేవాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో భార్యాభర్తల మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. భార్య డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో సహనం కోల్పోయిన జైపాల్ భార్య తలపై కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మ ను వెంటనే చికిత్స నిమిత్తం కోహీర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాగ్యమ్మ మృతి చెందింది. దీపావళి పండుగ రోజు సైతం జైపాల్ డబ్బుల కోసం గొడవ పడి కత్తి తో దాడి చేసి భాగ్యమ్మ ను గాయపరిచాడు. భాగ్యమ్మ మరణంతో తన కూతుర్లు ఇద్దరు అనాథలయ్యారు. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో పోస్ట్ మార్టం అనంతరం భాగ్యమ్మ మృత దేహానికి కోహీర్ పట్టణంలోని ఆనందపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, సీ ఐ రాజ బోయిన రవి, ఎస్సె నరేష్, సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో కేసుకు సంబంధించిన వివరాలు
సేకరించారు. సంఘటన అనంతరం పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని. మృతురాలి సోదరి శకుంతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నరేష్ తెలిపారు.
Also read
- తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్పై సీనియర్ దాడి… Video
- మద్యానికి బానిసై.. డబ్బుల కోసం భార్య దారుణ హత్య
- వికారాబాద్ లొ విషాదం.. యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య
- మహాబూబాబాద్..21 పేజీల లేఖ రాసి యువతి బలవన్మరణం
- రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ అడిగి ఇంటికి తీసుకెళ్లిన మహిళ.. ఆపై దుస్తులు విప్పేసి!… వీడియో





