రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మర్కాపురం జిల్లా గిద్దలూరులో ఓ మహిళ వాహనదారుడిని లిఫ్ట్ అడిగి తరవాత డబ్బులు దోచుకుంది.
రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మర్కాపురం జిల్లా గిద్దలూరులో ఓ మహిళ వాహనదారుడిని లిఫ్ట్ అడిగి తరవాత డబ్బులు దోచుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఓ మహిళ లిఫ్ట్ అడగ్గా బాధితుడు మొదట నో చెప్పాడు. అయినప్పటికీ మహిళ బతిమాలడంతో సరేనని ఒప్పుకుని బైక్ ఎక్కించుకున్నాడు. అనంతరం మహిళను పీఆర్ కాలనీలోని వారి ఇంటి వద్ద దింపగా.. ఇంట్లోకి వచ్చి నీళ్లు తాగండి అని కోరడంతో సరేనని వెళ్లగా ఓ వ్యక్తి వచ్చి ఇంట్లోకి లాక్కెళ్లాడు. అనంతరం బాధితుడి డ్రెస్ విప్పదీసి, మహిళ సైతం తన దుస్తులు విప్పగా ఇద్దరినీ ఫోటోలు తీశారు.
ఆ ఫోటోలు చూపించి బెదిరింపులకు పాల్పడుతూ లక్ష రూపాయలు ఇవ్వాలని లేదంటే తనతో అక్రమ సంబంధం పెట్టుకుని మోసం చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు చేసేది లేక ఫోన్ ద్వారా 7వేలు పంపి మిగితా డబ్బులు తరవాత ఇస్తానని చెప్పాడు. అయినప్పటికీ వాళ్లు వినకుండా బాండ్ పేపర్ పై లక్ష రూపాయలు బాకీ తీసుకున్నట్టు సంతకాలు పెట్టించుకుని ఒకరోజు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. అనంతరం ఒకరోజు తరవాత వదిలిపెట్టగా.. ఫోన్ లు చేసి డబ్బుల కోసం వేధింపులకు గురి చేశారు. బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అదుపులోకి తీసుకుని కేసును విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Also read
- తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్పై సీనియర్ దాడి… Video
- మద్యానికి బానిసై.. డబ్బుల కోసం భార్య దారుణ హత్య
- వికారాబాద్ లొ విషాదం.. యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య
- మహాబూబాబాద్..21 పేజీల లేఖ రాసి యువతి బలవన్మరణం
- రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ అడిగి ఇంటికి తీసుకెళ్లిన మహిళ.. ఆపై దుస్తులు విప్పేసి!… వీడియో





