చికిత్స కోసం వచ్చిన మహిళతో అసభ్య ప్రవర్తన
ఫిజియోథెరపిస్ట్ప శంకర్పల్లి పోలీస్టేషన్ లో కేసు
హైదరాబాద్, బంజారాహిల్స్: చికిత్స కోసం వచ్చిన ఓ మహిళను లైగింక వేధింపులకు గురిచేసిన ఓ ఫిజియోథెరపిస్ట్ప శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే జీరో ఎన్ఐఆర్ నమోదైన కేసు జూబ్లీహిల్స్ పోలీస్టేషన్కు బదిలీ అయింది. ఓ మహిళ భుజం నొప్పితో 2025 ఆగస్టు, సెప్టెంబర్ మోకిలాలోని 24 ఫిజియోథెరపీ క్లినిక్లో చేరింది.
జూబ్లీహిల్స్ రోడ్ నెం-35కు చెందిన ఫిజెయోథెరపిస్ట్ రేలంగి సునీల్ కుమార్ ట్రీట్మెంట్ పేరిట ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమె అనుమతిలేకుండా ముద్దు పెట్టుకున్నాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు నిలదీయగా క్షమాపణ చెప్పాడు. నిందితుడి ప్రవర్తనతో డిప్రెషన్కు గురైన బాధితురాలు కౌన్సెలింగ్ సైతం తీసుకుంది. నిందితుడు జూబ్లీహిల్స్లో అనుమతులు లేకుండానే క్లినిక్ నడుపుతున్నాడని, అధికారుల తనిఖీల సమాచారం తెలియడంతో రాత్రికిరాత్రే పరికరాలు తరలించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





