దాసేగౌడతో హరిణికి వివాహం జరిగింది. ఓ జాతరలో హరిణికి యశస్‌తో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత గంటలకొద్ది ఫోన్లో మాట్లాడటంపై భర్తకు అనుమానం.. నెక్స్ట్ సీన్లో హరిణి- యశస్ మధ్య నో కమ్యూనికేషన్. క్షమించమని భర్తను కోరిన హరిణి.. కట్ చేస్తే.. ఓయో రూమ్‌లో మాట్లాడుకున్న హరిణి- యశస్.. క్లైమాక్స్‌లో..
ఈమె పేరు హరిణి. బెంగళూరులోని కెంగేరి ప్రాపర్. దాసేగౌడతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ కెంగేరిలోనే ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం స్థానికంగా జాతర జరిగితే హరిణి అక్కడికి వెళ్లింది. అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ యశస్ పరిచయం అయ్యాడు. ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడాలు.. కాలింగ్‌లు, చాటింగ్‌లతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అంతేకాదు.. వివాహేతర సంబంధానికి దారితీసింది. హరిణి వ్యవహారంపై భర్త దాసేగౌడకు అనుమానం వచ్చింది. గంటలకొద్ది ఫోన్‌కి అతుక్కుపోవడంతో ఏంటా ఆని ఆరాతీశాడు. సంబంధం బయటపడటంతో ఫోన్ తీసుకున్నాడు. దీంతో హరిణి – యశస్ మధ్య కమ్యూనికేషన్ లేకుండాపోయింది. అయితే తన తప్పుని తెలుసుకుని.. భర్త దగ్గర కన్నీరుపెట్టుకుని క్షమించమని కోరింది. ఆమెను నమ్మి భర్త ఫోన్ ఇవ్వడంతో హరిణితో యశస్ కాంటాక్ట్‌లోకి వచ్చాడు. మళ్లీ పాత కథ మొదలైంది.
ఓ రోజు మాట్లాడాలని ఉందంటూ హరిణిని ఓయో హోటల్‌కి పిలిపించాడు యశస్. ఇద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. తనతో ఉండాలని పట్టుబట్టాడు యశస్. అందుకు ఆమె అంగీకరించలేదు. ఎంత బతిమాలినా ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు యశస్. హరిణిని కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలైన ఆమె స్పాట్లోనే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. విచారణలో భాగంగా యశస్‌ను అరెస్ట్ చేశారు. అందమైన జీవితాన్ని చేజేతులా ఆగాంధంలోకి నెట్టివేసుకుంది హరిణి. క్షమించిన భర్తతో హ్యాపీగా ఉండకుండా యశస్‌తో మాట్లాడి క్షమించరాని తప్పు చేసింది. పరాయి మోజులో పడి దారుణ హత్యకు గురయింది. రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టివేసింది.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు