SGSTV NEWS
CrimeNational

భార్య మాస్టర్ ప్లాన్.. భర్తను హనీమూన్‌కు తీసుకెళ్లి లేపేసింది..!

మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజారఘువంశీని భార్య సోనమ్ చంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల రాజా-సోనమ్ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అక్కడ రాజు హత్యకు గురికాగా సోనమ్ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే

మేఘాలయలోని ఇందౌర్‌ దంపతుల మిస్సింగ్ కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్‌ కోసం వెళ్లిన నవ దంపతులు మిస్సింగ్ కాగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ డెడ్ బాడీ లభ్యమైన సంగతి తెలిసిందే. కానీ అతడి భార్య సోనమ్ ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగానే కనిపించకుండా పోయిన సోనమ్‌ ఆచూకీని పోలీసులు తాజాగా కనిపెట్టారు. భర్త హత్య కేసులో భార్యే హంతకురాలుగా గుర్తించారు. ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే.. ఆమె కాంట్రాక్ట్‌ కిల్లర్లకు సుపారీ ఇచ్చి భర్తను చంపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.

భార్య మాస్టర్ ప్లాన్.. భర్తను హనీమూన్‌కు తీసుకెళ్లి లేపేసింది..!
మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజారఘువంశీని భార్య సోనమ్ చంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల రాజా-సోనమ్ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అక్కడ రాజు హత్యకు గురికాగా సోనమ్ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

మేఘాలయలోని ఇందౌర్‌ దంపతుల మిస్సింగ్ కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్‌ కోసం వెళ్లిన నవ దంపతులు మిస్సింగ్ కాగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ డెడ్ బాడీ లభ్యమైన సంగతి తెలిసిందే. కానీ అతడి భార్య సోనమ్ ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.

Also Read: సవకే సవక.. రూ.14వేల భారీ డిస్కౌంట్ – 8GB ర్యామ్, 50MP కెమెరా ఫోన్‌ తక్కువకే!

ఇందులో భాగంగానే కనిపించకుండా పోయిన సోనమ్‌ ఆచూకీని పోలీసులు తాజాగా కనిపెట్టారు. భర్త హత్య కేసులో భార్యే హంతకురాలుగా గుర్తించారు. ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే.. ఆమె కాంట్రాక్ట్‌ కిల్లర్లకు సుపారీ ఇచ్చి భర్తను చంపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.

Also Read: ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

ఏం జరిగిందంటే?
రాజ రఘవంశీ, అతడి భార్య సోనమ్ మే నెలలో హనీమూన్కోసం మధ్యప్రదేశ్నుంచి మేఘాలయకు వెళ్లారు. అనంతరం మే 23 నుంచి ఆ జంట కనిపించకుండా పోయింది. దీంతో ఈ నవ దంపతుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత జూన్ 2వ తేదీన రాజ డెడ్‌బాడీ లభ్యమైంది.

చిరాపుంజికి సమీపంలోని ఒక లోయలో అతడి మృతదేహం దొరికింది. కానీ మృతుడి భార్య సోనమ్ జాడను ఎవరూ గుర్తించలేకపోయారు. ఆ సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. ఒక టూరిస్ట్ గైడ్ సంచలన విషయాలను పోలీసులకు తెలిపాడు.

మే 23న ఉదయం 10 గంటల ప్రాంతంలో నలుగురు పురుషులతో కలిసి ఆ జంట నోంగ్రియాట్ నుండి మౌలాఖియాత్‌కు 3000 కంటే ఎక్కువ మెట్లు ఎక్కడాన్ని తాను చూశానని మౌలాఖియాత్‌కు చెందిన గైడ్ ఆల్బర్ట్ పిడి చెప్పారు. వారు హిందీలో మాట్లాడుతుండటంతో తనకు ఏమీ అర్థం కాలేదని అన్నారు. దీని కంటే ముందు రోజు వారు తన దగ్గరకు వచ్చి టూరిస్ట్ గైడ్ చేయమని అడిగారని.. అందువల్లే ఇంకా వారు తనకు బాగా గుర్తున్నారు అని తెలిపారు

ఇలా గైడ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే ముగ్గురు కిల్లర్లను అరెస్టు చేశారు. అందులో ఒకరిని యూపీ నుంచి, ఇద్దరిని ఇండోర్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. రాజ రఘవంశీ భార్య సోనమ్ తమకు డబ్బులు ఇచ్చి చంపమని చెప్పిందని కిల్లర్లు తెలిపారు. దీని అనంతరం సోనమ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వీరిలో మరో కిల్లర్ పరారీలో ఉండగా.. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also read

Related posts

Share this