నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.30 వేల అప్పు ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు స్నేహితులు కలిసి తమ మిత్రుడు సాయికుమార్‌ను హత్య చేశారు. మద్యం తాగుదామని పిలిచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు బండరాయితో తలపై దాడి చేసి చంపారు. అనంతరం అతని వద్ద ఉన్న బంగారం, సెల్‌ఫోన్‌తో పరారయ్యారు.
స్నేహం అంటే నమ్మకం.. ఆపదలో అండగా నిలబడటం. కానీ నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ ఘటన మాత్రం స్నేహం అనే బంధానికే మచ్చ తెచ్చింది. అప్పుగా డబ్బు అడిగితే ఇవ్వలేదనే కోపంతో స్నేహితుడినే హత్య చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన పూర్ణాన్ (37), ఆరీఫ్ (26) నల్లగొండలోని బొట్టుగూడ, మేథర్ కాలనీలో కొంత కాలంగా నివాసముంటూ బైక్ పై తిరుగుతూ చీరల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉంటూ ఆడ వేశంలో ఎల్లమ్మ పండగలు చేసే బోధ్ సాయికుమార్ తో స్నేహం పెంచుకున్నారు. తరచూ కలిసి తిరగడం, మద్యం సేవించడం వల్ల ముగ్గురి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ చనువుతో సాయికుమార్ ను ఫుర్ఖాన్ రూ.30వేలు అప్పు అడిగాడు. అయితే సాయి కుమార్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో అతనిపై ఫుర్ధాన్ కక్ష పెంచుకున్నాడు. ఆ తర్వాత సాయికుమార్‌ను హత్య చేయాలని ఫుర్ఖాన్ కుట్ర పన్నాడు. ఈ నెల 8న మరో మిత్రుడు ఆరీఫ్ తో కలిసి కేశరాజుపల్లిలోనీ వెంచర్ లో మద్యం తాగుదామని పథకం ప్రకారం సాయి కుమార్ ను.. ఫుర్ఖాన్ పిలిచాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగుతూ.. డబ్బు అత్యవసరముందని మరోసారి ఫుర్ఖాన్ ను 30 వేల రూపాయలను అప్పుగా అడిగాడు. సాయి కుమార్ ఇవ్వకపోవడంతో ఆవేశంలో ఇద్దరు కలిసి బండరాయితో సాయి కుమార్ తలపై కొట్టి హత్య చేశారు.
చేతికి, మెడకు ఉన్న ఆరు తులాల బంగారం, ఫోన్ తో బైక్ పై పరారయ్యారు. దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు విజయవాడలో ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో బంగారం, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని నల్లగొండ జిల్లా ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి చెప్పారు. ఆధారాలు లేకుండా తప్పించుకోవచ్చని భావించినా, సెల్‌ఫోన్ ట్రాకింగ్, కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలతో కటకటాల పాలయ్యారు.
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





