అక్రమ సంబంధం మోజుతో ఓ తల్లి ఎవరూ చేయరాని అకృత్యానికి పాల్పడింది. ప్రియునితో వెళ్లిపోయిన తల్లి.. ఆ తరువాత కూతురిని కడతేర్చింది. ఈ దారుణం బెంగళూరు కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బాలిక హత్యపై భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్ పై తండ్రి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు.
దావణగెరెకు చెందిన ప్రవీణ్, బెంగళూరువాసి ప్రియాంకకు 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 17, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియాంక కాలేజీ ప్రియుడు మోహన్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీని గురించి భర్త ప్రశ్నించగా, ప్రియాంక విడాకులు కావాలని పట్టుబట్టింది. చివరకు కుమార్తెలతో వెళ్లిపోయింది.
హఠాత్తుగా బాలిక మృతి..
మార్చి 24న చిన్న కూతురు ఆకస్మాత్తుగా మరణించింది. ఏమైందని భర్త వెళ్లి ప్రియాంకను అడగ్గా, బిర్యానీ తింటూ చనిపోయిందని ఒకసారి, ఐస్ క్రీమ్ ఇచ్చి, ఏసీ వేసి కారులోనే పడుకోబెడితో మరణించిందని మరోసారి చెప్పింది. బాలిక నల్లగా ఉందని తరచూ తల్లి సతాయించేదని తెలిసింది. కుమార్తెను కొట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రియుడు మోహన్‌ను అరెస్టు చేయగా, ఇంతలో తల్లి పరారైంది.
బెంగళూరు
Also read
- ఈడ్చుకెళ్లి… గొంతుకోసి..అత్తపై కోడలు హత్యాయత్నం
- బ్యాటరీ ఛార్జర్.. బాలుడి ప్రాణం తీసింది
- నేటి జాతకములు 23 జూలై, 2026
- varahi ammavaru: వారాహి అమ్మవారి పుట్టుక గురించి తెలుసా..? అసలు ఆమెకున్న శక్తులేంటో తెలుసా..?
- మరణించిన వారి కోసం ఎక్కువగా ఏడవకూడదట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే





