మానవత్వం మంటగలిచింది. తల్లిదండ్రుల తర్వాత మేనమామ పెద్ద దిక్కు అంటారు. అలాంటిది ఆ పసిబిడ్డకు సొంత మేనమామ కాలయముదయ్యాడు. తల్లితండ్రులు చనిపోయి.. అనాథగా మారిన ఓ చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు సొంత మేనమామ, అత్త. పసిపాపపై పైశాచికత్వం ప్రదర్శించారు. అభం శుభం తెలియని చిన్నారిని ఊరి గానీ ఊరికి తీసుకువచ్చి నరకం చూపించారు.
మానవత్వం మంటగలిచింది. తల్లిదండ్రుల తర్వాత మేనమామ పెద్ద దిక్కు అంటారు. అలాంటిది ఆ పసిబిడ్డకు సొంత మేనమామ కాలయముదయ్యాడు. తల్లితండ్రులు చనిపోయి.. అనాథగా మారిన ఓ చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు సొంత మేనమామ, అత్త. పసిపాపపై పైశాచికత్వం ప్రదర్శించారు. అభం శుభం తెలియని చిన్నారిని ఊరి గానీ ఊరికి తీసుకువచ్చి నరకం చూపించారు. ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు మండలం కట్టుబడిపాలెంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బీహార్ రాష్ట్రానికి చెందిన దంపతులు కుటుంబసమేతంగా 20 రోజుల క్రితం కట్టుబడిపాలెనికి వలస వచ్చారు. తల్లిదండ్రులు లేని మైనర్ బాలికను తమతో పాటు తీసుకువచ్చారు మేనత్త, మేనమామ. అయితే బాలిక ఒంటిపై తీవ్ర గాయాలు చూసిన స్థానికులు, CWC అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ బాలికను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్న మేనత్త, మేనమామ తరచూ చిన్నారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. ఇటీవల చిన్నారి ఒంటిపై వాతలు పెట్టాడు. స్థానికులు పసిబాలికపై గాయాలు చూడలేక అధికారులకు ఫిర్యాద చేశారు. దీంతో పోలీసుల సాయంతో సంఘటనాస్థలానికి చేరుకున్న విచారణ చేపట్టారు.
బాలిక ఒంటి పై దాడి చేసిన తీవ్రమైన గాయాలు, కాల్చిన గాయాలు ఉండటంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇందుకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు
Also read
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్‌పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..
- వారు బైక్‌పై ఇద్దరు వస్తున్నా.. రాత్రి సమయం అని ఇతనికి లిఫ్ట్ ఇచ్చారు.. కానీ కాసేపటికే..





