SGSTV NEWS online
CrimeTelangana

వాటర్ హీటర్ తగిలి వివాహిత మృతి… విషాద ఘటన!



హైదరాబాద్: స్నానం చేసేందుకు నీటిని వేడి చేస్తుండగా
ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ తగిలి ఓ వివాహిత మృతి చెందింది. ఈ విషాద ఘటన నగరంలోని బోరబండ పోలీస్టేషన్ పరిధిలో ఉన్న భరత్నగర్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. రెండు నెలల పసిబాబును వదిలి ఆమె మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

పోలీసుల వివరాల ప్రకారం.. భరత్నగర్లో అబ్దుల్ రవూఫ్ తన భార్య అయేషాబేగంతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. రవూఫ్ ప్లంబర్గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు రెండు నెలల క్రితమే బాబు జన్మించాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అయేషాబేగం స్నానం చేసేందుకు నీటి బకెట్లో వాటర్ హీటర్ను పెట్టింది. అయితే, ప్రమాదవశాత్తు హీటర్ తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

కింద పోర్షన్లో నివసిస్తున్నవారు బాబు ఏడుపులు విని పైకి వచ్చి చూడగా.. అప్పటికే అయేషాబేగం మృతి చెంది ఉంది. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts