SGSTV NEWS
CrimeTelangana

ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి…తీవ్ర ఉద్రిక్తత


ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్షం పలువురి ప్రాణాలు తీస్తుంది. తాజాగా సూర్యాపేట జిల్లాలో మరోసారి ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఈ నిర్లక్ష్యం మూలంగా ఓ పసికందు మృతిచెందింది. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.


TG Crime: ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్షం పలువురి ప్రాణాలు తీస్తున్న వారిలో మార్పు రావడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలో మరోసారి ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఈ నిర్లక్ష్యం మూలంగా ఓ పసికందు మృతిచెందింది. జిల్లా కేంద్రంలోని ప్రైమ్ చిన్నపిల్లల హాస్పిటల్‌లో డాక్లర్ల నిర్లక్ష్యం వల్లే తమ మూడున్నర నెలల బాబు మృతిచెందాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జాటో జలంధర్, మనిషా దంపతులకు ఇటీవలే బాబు పుట్టాడు. వారి ఇదే తొలి సంతానం. నాలుగు రోజుల క్రితం ఆ బాబుకు తీవ్ర జ్వరం వచ్చింది. వెంటనే వారు  జిల్లా కేంద్రంలోని ప్రైమ్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత బాబు ఆరోగ్యం బానే ఉందని డాక్టర్లు చెబుతూ వచ్చారు.  రెండురోజుల తర్వాత బాబు ఆరోగ్యం క్షీణించిందని తల్లిదండ్రులు డాక్టర్లకు సమాచారం ఇచ్చినప్పటికీ హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోకుండా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతూ వచ్చారని వారు ఆరోపించారు

వైద్యులు పట్టించుకోకపోవడం ఆరోగ్యం మరింత విషమించడంతో శిశువును ఖమ్మం తరలించేందుకు వారు ప్రయత్నించారు. అయితే బాలుడు మార్గమధ్యలో మృతి చెందాడు. తమ కుమారుడు మరణించడానికి ప్రైమ్‌ హాస్పిటల్ నిర్లక్ష్యమే కారణమంటూ హాస్పిటల్ ఎదుట బంధువులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బాబు బంధువులు ఆందోళనకు దిగి హాస్పిటల్ అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు, ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో  తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన బంధువులు హాస్పిటల్ పై రాళ్లు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారు. అందులో ఒకటి కానిస్టేబుల్ తలకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు.

హాస్పిటల్‌లో ఉద్రిక్తత నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారు.హాస్పిటల్‌ను తాత్కాలికంగా సీజ్ చేసి విచారణ చేపట్టారు. బాధిత కుటుంబం తమకు తగిన న్యాయం అందించాలని అధికారులను డిమాండ్‌ చేశారు. కాగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హాస్పిటల్ ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

Also read

Related posts

Share this