SGSTV NEWS
Andhra PradeshCrime

Murder: భార్యపై కత్తితో దాడి.. అడ్డొచ్చిన అత్తమామలనూ నరికి చంపిన అల్లుడు



తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. అడ్డొచ్చిన అత్తమామలనే నరికేశాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య పెరిగే గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. అడ్డొచ్చిన అత్తమామలనే నరికేశాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. దుత్తలూరులో ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏలూరి వెంగయ్య, అంకమ్మ భార్యభర్తలు. వీళ్లమధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

అయితే మద్యం మత్తులో వెంగయ్య భార్యపై కోపంతో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అతడిని అడ్డుకునేందుకు వచ్చిన మామ కంజయ్య, అత్త జయమ్మనూ కూడా నరికేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అత్తమామలు అక్కడికక్కడే మృతి చెందారు. భార్య అంకమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు వెంగయ్య పరారీలో ఉన్నాడు.

ఇదిలాఉండగా యాదాద్రి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదనే కారణంతో పురుగుల మందు సేవించి ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. బీబీనగర్ మండలం కొండమడుగు రాగాల రిసార్ట్‌లో ఈ ఘటన జరిగింది.  రిసార్ట్ సిబ్బంది ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇద్దరూ నిర్జీవంగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.  మృతులది హైదరాబాద్‌    లోని రామంతాపూర్ గా గుర్తించారు.

Also read

Related posts

Share this