కడప జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. మద్యం తాగి వచ్చి ప్రతిరోజు తల్లిని వేధిస్తున్న తండ్రిని, ఓ పదో తరగతి విద్యార్థి ఆవేశంలో పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేశాడు. తల్లి పడుతున్న బాధను చూడలేక, ఆమెకు రక్షణగా నిలవాలనుకున్న క్రమంలో.. ఆవేశంతో చేసిన ఈ పనితో తండ్రి ప్రాణాలు కోల్పోగా, కొడుకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రతిరోజు తాగి వచ్చి తల్లిని వేధిస్తున్నాడని ఓ విద్యార్థి తన తండ్రిని కడతేర్చాడు.. తల్లి బాధ చూడలేక రోజు తన తండ్రి చేస్తున్న ఆగడాలను భరించలేక.. పదునైన వస్తువుతో తండ్రిని కొట్టి కిరాతకంగా హత్య చేశాడు ఆ కొడుకు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో కలకలం రేపింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం ఓబుల్ రెడ్డి పేటలో పదో తరగతి విద్యార్థి తన తండ్రిని కడతేర్చాడు.
మద్యానికి బానిసై ప్రతిరోజు తల్లిని వేధిస్తున్న తండ్రి పిరాన్ భాషను మైనర్ బాలుడైన పదవ తరగతి విద్యార్థి పదునైన ఆయుధంతో కొట్టాడు.. అది తగలరాని చోట తగిలి తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. చంపాలి అనే ఉద్దేశం లేకపోయినా తన తల్లిని వేధిస్తున్న సమయంలో అడ్డుపడి తల్లికి రక్షణగా నిలవాలనుకున్నాడు. అయితే అదే సమయంలో చేతికి దొరికిన పదునైన ఆయుధంతో తన తండ్రిని కొట్టడంతో అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మైనర్ బాలుడైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటనతో పిరాన్ భాష ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. ఆవేశంతో చేసిన ఈ ఒక్క పనితో.. తండ్రి ప్రాణాలు కోల్పోగా.. కొడుకు జైలు పాలయ్యాడు.
Also read
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..





