విజయవాడ : ఎపి లోని విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమానుష ఘటన జరిగింది. మహిళల బాత్రూంలోకి ఓ యువకుడు ప్రవేశించి, మహిళలు స్నానాలు చేసే దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడు. ఇది గమనించిన పలువురు మహిళలు కేకలు వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహిళల అరుపులతో అప్రమత్తమైన యాత్రికులు, మహిళా సెక్యూరిటీ సిబ్బంది నిందితుడిని పట్టుకుని, చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని విజయవాడలోని చిట్టినగర్‌కు చెందిన నరేష్ గా గుర్తించారు. అతని మొబైల్ స్వాధీనం చేసుకుని సేల్ ఫోన్ డేటాను పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
- దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..
- 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!





