బంగారం ధరలు పెరగడంతో చోరీలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. రద్దీగా ఉండే మాంబోజీపల్లి మార్కెట్ (సంత)లో పట్టపగలే చేతివాటం ప్రదర్శించారు దుండగులు. కూరగాయలు కొనేందుకు వెళ్లిన దంపతులను టార్గెట్ చేశారు. ఏకంగా 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కొల్చారం మండలానికి చెందిన చింతలగారి శ్రావణి – ప్రవీణ్ దంపతులిద్దరూ మెదక్ వెళ్లి తిరిగి వస్తున్నారు. దారిలో మాంబోజీపల్లి సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగారు. ఆ సమయంలో రద్దీని అదునుగా తీసుకున్న గుర్తు తెలియని మాయగాళ్లు శ్రావణి హ్యాండ్ బ్యాగులోని నగలను మాయం చేశారు. 2.5 తులాల బంగారు నెక్లెస్, 2 తులాల నల్లపూసల గొలుసు, అర తులం బరువున్న మాటీలు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారు. మొత్తం వీటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని దంపతులు తెలిపారు.
మార్కెట్లో కూరగాయలు తీసుకున్న కాసేపటికే బ్యాగ్ తనిఖీ చేసిన శ్రావణి.. అందులో నగలు లేకపోవడంతో షాక్కు గురయ్యారు. సంతలో అటు ఇటు వెతికినా ఫలితం లేకపోయింది. హుటాహుటిన బాధితులు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సంతలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుల కదలికలను పోలీసులు పరిశీలించారు. జనసందోహం ఎక్కువగా ఉండే సంతలు, మార్కెట్లలో మహిళలు తమ నగలు, బ్యాగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also read
- ఉద్యోగం వస్తే ఇలా చేయాల్నా.. భర్తను కేసులతో హింసించిన భార్య.. పాపం చివరకు
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- AP News: చోరి సొమ్ము వాటాల పంపిణీలో బెడిసిన యవ్వారం.. గ్యాంగ్ లీడర్ హత్య!
- అతనికి 24.. ఆమెకు 16.. ఇన్స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?
- హైదరాబాద్లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్ నిజాలు! చూశారంటే





