SGSTV NEWS
CrimeNational

Kalaburagi Wife: ‘నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీయను’


కర్ణాటకలోని కలబురగిలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంది. తన భర్తను చంపిన ముగ్గురిని హతమార్చింది. అందులో మూడో వ్యక్తి నిందితుడు అనుకుని ఒక అమాయకుడ్ని హత్య చేయడం గమనార్హం.

కర్ణాటకలోని కలబురగిలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంది. తన భర్తను ఎవరైతే హత్య చేశారో.. వారిని చంపుతానని ప్రతిజ్ఞ చేసి మరీ నిందితులను హతమార్చింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రతీకారం తీర్చుకుంటా
గతేడాది నవంబర్ 12న సోమ్‌నాథ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సిద్ధారుధ, జగదీష్, రామచంద్ర ముగ్గురూ కలిసి సోమ్‌నాథ్‌ను హత్య చేశారు. దీంతో మృతుడి భార్య భాగ్యశ్రీ కోపంతో రగిలిపోయింది. తన భర్త మృతదేహం ముందే ప్రమాణం చేసింది. తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మెడలోని మంగళసూత్రాన్ని తీయనని ప్రతిజ్ఞ చేసింది.

దీంతో తన భర్తను హత్య చేసిన నిందితులు ఎప్పుడెప్పుడు జైలు నుంచి బయటకు వస్తారా? అని ఎదురుచూసింది. ఈ క్రమంలో తన భర్త సోదరుడు ఈరన్నతో పాటు మరికొందరితో స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే నిందితులు ముగ్గురూ ఇటీవల బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. దీంతో జూన్ 24న అర్ధరాత్రి సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32) ఒక ధాబాలో ఉన్నారని సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు.

దాదాపు 10 మంది దాబాలోకి వెళ్లి సిద్ధారుధ, జగదీష్‌ను హతమార్చారు. అదే సమయంలో మరొక వ్యక్తి రామచంద్ర అనుకుని అన్నప్ప అనే వ్యక్తిని మర్డర్ చేశారు. చీకటిలో గుర్తుపట్టలేక అమాయకుడైన అప్పన్న హత్యకు గురయ్యాడు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వారిని పట్టాన్ గ్రామ నివాసితులు భాగ్యశ్రీ (30), నాగరాజ (23), సిద్ధినాద (22), భిర్ణ్య (21), ఇరన్న (27), పిరేష్ (35), నాగరాజ్ (17), రచన్న్య అలియాస్ గిల్లి (22), సాగర్ (24), చంద్రకాంత్ (30) లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని విచారించగా.. వారు హత్యకు గల కారణాలను వెల్లడించారు.

Also read

Related posts

Share this