SGSTV NEWS online
Andhra PradeshCrime

ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..



నెల్లూరు జిల్లాలోని సంగం మండలం దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు, ఆయన భార్య రత్నవేణి, దత్తపుత్రుడు సాయి సుకృత్ మృతదేహాలు ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో లభించాయి. గదిలో లభించిన నోట్‌లో ఆస్తుల పంపకం, అంత్యక్రియల ఖర్చుల కోసం నగదు బదిలీ వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మృతుల చేతులు కట్టేసి ఉండటం, ఘటనాస్థలంలోని పరిస్థితులు పలు అనుమానాలకు తావిస్తోంది.



ఏమైందో ఏమో తెలియదు.. ఆస్తులు పంచారు.. కొన్ని డబ్బులు అకౌంట్లో వేసుకున్నారు.. ఆ తర్వాత.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య సంచలనంగా మారింది. అక్కడి పరిస్థితులు చూసిన స్థానికులు.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు సంగం మండలం దువ్వూరులో ఈ విషాదం చోటు చేసుకుంది. భార్య, భర్త, కుమారుడు.. ముగ్గురూ ఉరివేసుకుని మృతి చెందినట్లు కనిపిస్తుంది.. కానీ.. అక్కడి సీన్ చూస్తే ఎవరో చంపినట్లు కనిపిస్తోంది.. ఉరి వేసుకుని మృతి చెందిన ముగ్గురు చేతులు కట్టేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. వెనక్కి, మరొకరికి ముందుకు చేతులు విరిచి కట్టినట్లు కనిపిస్తుంది.. అయితే మృతదేహాలు ఉన్న గదిలో గోడకు ఓ నోట్ ఉంది.. అందులో మా మరణ వాంగ్మూలం బీరువాలో ఉంది అని రాసి ఉంది.


మృతులు భార్యాభర్తలు రత్నవేణి, మధుసూదన్‌రావు, కుమారుడు సాయి సుక్రుత్‌ గా పోలీసులు నిర్దారించారు. మధుసూదన్‌రావు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు.. బీరువాలో ఆ మరణ వాంగ్మూలం గుర్తించిన పోలీసులు అందులో ఉన్న అంశాలపై విచారణ జరుపుతున్నారు. మధుసూదన్ రత్నవేణి దంపతులకు సంతానం లేదు.. దీంతో అనాధగా ఉన్న సుకృత్ ను చిన్న వయసులో దత్తత తీసుకుని పెంచుకున్నారు.. శుకృత్ కెరీర్ లో స్థిర పడలేదు.. కుమారుడు మానసికంగా సరిగా లేడన్న దిగులు మధుకు ఉండేదని.. బహుశా ఇదే కారణంగా అత్మహత్య చేసుకుని ఉండొచ్చని గ్రామస్థులు, బంధువులు అంటున్నారు.

అయితే.. వ్యక్తి గత కారణాలతో తాము చనిపోతున్నట్లు వాంగ్మూలం లో పేర్కొన్న మధు సుధన్ కుటుంబ సభ్యులు.. తమ ఆస్తులను బంధువులకు పంచాలని దానిలో రాశారు. 17 సవర్ల బంగారంను వాళ్ళ బంధువులకు ఇవ్వాలని నోట్ లో ఉంది. బుచ్చిలో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ ను ఒక అక్క కుమారుడు కి ఇవ్వాలని.. అలాగే బుచ్చిలో ఉన్న మరో ఓపెన్ ప్లాట్ నూ నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ కు ఇవ్వాలని రాశారు.. అంత్యక్రియలు కు అయ్యే ఖర్చుల డబ్బులు కూడా ఒక అక్క అకౌంట్ కి రాత్రి ట్రాన్సఫర్ చేసినట్టు నోట్ లో ఉంది. అయితే.. వారు ఉరి వేసుకుని మరణించినప్పటికీ.. అక్కడి పరిస్థితులు మరోలా కనిపిస్తుండటంతో.. ముగ్గురి మరణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also read

Related posts