విజయవాడలో పర్యటించిన జగన్ సింగ్ నగర్ లో వరద బాధితులకు పరామర్శ సాయం అందలేదా? అంటూ వాకబు చేసిన వైసీపీ అధినేత మెడ వరకు నీళ్లున్నప్పటికీ, కొంతమందికి ఇచ్చారని వెల్లడించిన ఓ యువతి
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడ సింగ్ నగర్ లో వరద బాధితులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సాయం అందలేదని ధ్వజమెత్తారు.
కాగా, బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో, ఓ యువతి నిర్మొహమాటంగా సమాధానం చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…”మీకు ప్రభుత్వ సాయం అందిందా… ఇంకా అందలేదా?” అని జగన్ ఓ మహిళను అడగ్గా… పక్కనే ఉన్న యువతి స్పందిస్తూ… “నీళ్లు మెడ వరకు ఉన్నాయి… పాపం, వాళ్లయినా ఎలా ఇస్తారు? అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు” అని స్పష్టం చేసింది.
తాజా వార్తలు చదవండి
- బాలికపై లైంగికదాడి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
- ‘చదవడం’ నావల్ల కాదన్నా వినిపించుకోరేం?
- నా భర్తకు తెలిస్తే నా జీవితం నాశనమవుతుంది..!
- క్యాబ్ ఎక్కాలంటేనే భయం!
- Andhra Pradesh: మా దగ్గర మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. కట్‌చేస్తే..





