వరంగల్‌లో జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఇద్దరు యువకుల వీరంగం సృష్టించారు. ఫుల్‌గా తిగిన యువకులు అర్దరాత్రి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. సీసీ కెమెరాలలో రికార్డయిన వాళ్లు ఫైటింగ్ దృశ్యాలను చూసి అంతా షాక్ అయ్యారు. తీరా ఎందుకు గొడవపడ్డారని ఆరా తీస్తే ఊహించని విషయం తెలిసింది. అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఫుల్‌గా తాగిన తర్వాత ఇద్దరు యువకులు పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. అర్థరాత్రి అగ్గిపెట్టె ఆ ఇద్దరి మధ్య అగ్గి రాజుకునేలా చేసింది. అర్దరాత్రి మత్తులో ఘర్షణ పడ్డ యువకులు వీరంగం సృష్టించారు. అక్కడున్న వారంతా హడలెత్తి పోయేలా చేశారు. అచ్చం సినీ ఫక్కీలో పరస్పర దాడులతో హంగామా చేశారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకొని గొడవకు గల కారణాలను తెలుసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 41 డివిజన్ లో ఈ ఘటన జరిగింది. ఫుల్‌గా తాగిన ఇద్దరు యువకులు అర్థరాత్రి సినిమా స్టైల్లో పరస్పర దాడులు చేసుకున్నారు. బండరాళ్లు, వుడ్ బాక్స్ లతో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఐతే అగ్గిపెట్టె విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డట్లు పోలీసులు గుర్తించారు.
వరుస ఘటనల నేపథ్యంలో కటినంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ ఘటనపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్ల పై పోకిరీలు వీరంగం సృష్టిస్తే కఠినచర్యలు ఉంటాయని పోలీసుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్‌పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..





