విశాఖ గాజువాకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అనంతరం కొన్ని శరీర భాగాలను ఫ్రిజ్‌లో ఉంచి.. మరికొన్ని శరీర భాగాలను సంచిలో మూటకట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలిని ఇంటికి పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేయసిని ముక్కలు ముక్కలుగా నరికి.. ఆమె శరీర భాగాలను ప్రియుడు ప్రిజ్‌లో దాచి పెట్టిన దారుణ ఘటన విశాఖపట్నం జిల్లా గాజువాక LV నగర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాప్ట్ టెక్నిషీయన్‌గా పనిచేస్తున్న రవీంద్రకు కైలాసపురానికి చెందిన వివాహితురాలు మౌనికతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం ప్రియురాలు మౌనికను తన ఇంటికి రమ్మని పిలిచాడు. రాత్రి వరకు ఇద్దరూ సఖ్యతగానే ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే అర్ధరాత్రి వారిద్దరి మధ్య చిన్న పాటి వాగ్వాదం జరిగింది, మౌనిక డబ్బులు అడగడంతో క్రమేణా గొడవ పెద్దదైంది. దీంతో కోపంతో రగిలిపోయిన రవీంద్ర.. ఇంట్లో ఉన్న కత్తితో మౌనికను పొడిచి చంపేశాడు. ఆమె చనిపోయిన తర్వాత మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి, సగ భాగాన్ని ఫ్రిజ్‌లో పెట్టేశాడు. మరో భాగాన్ని మూటకట్టి ఇంట్లోనే ఓ మూలన ఉంచాడు. తలా కాళ్ల భాగం పెందుర్తి దారపాలెం ప్రాంతంలో దహనం చేశాడు
అనంతరం నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి తాను చేసిన నేరాన్ని వివరించి, లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడంతో, తనను మౌనిక డబ్బుకోసం తీవ్రంగా వేధిస్తోందని, తట్టుకోలేక హతమార్చానని అంగీకరించాడు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్‌గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





